నువులేని లోకం.. నాకెందుకు.. చిన్నితండ్రీ..!
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:11 AM
ఒక్కగానొక్క కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక పట్టణంలోని ప్రియాంకనగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రజనీబాబు (50) బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ధర్మవరం, సెప్టెంబరు 11: ఒక్కగానొక్క కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక పట్టణంలోని ప్రియాంకనగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రజనీబాబు (50) బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వనటౌన పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... రజనీబాబు, రామాంజినమ్మ దంపతులకు కుమారుడు నిశాంత, కుమార్తె ఉండేవారు. రామాంజినమ్మ అగళి పీహెచసీలో నర్సుగా పనిచేస్తున్నారు. కుమార్తెకు వివాహం చేశారు. నిశాంత తొమ్మిదో తరగతి చదువుతుండేవాడు. ఒక్కడే కొడుకు కావడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. నిశాంత గతేడాది వినాయక చవితి పండుగ రోజే ఈతకు వెళ్లి, నీటమునిగి మరణించాడు. కుమారుడి మరణాన్ని రజనీబాబు జీర్ణంచుకోలేకపోయాడు. కుమారుడిని తలచుకుని, తీవ్ర ఆవేదన చెందుతుండేవాడు. మళ్లీ గణేశ పండుగ వచ్చించి. అంతటా సంబరాలు చేసుకుంటున్నారు.
రజనీబాబుకు మాత్రం చనిపోయిన కుమారుడే గుర్తుకొచ్చాడు. బిడ్డను తలచుకుని తీవ్రంఆ కుంగిపోయాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు. కాసేపటికి స్థానికులు గమనించి, వనటౌన పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గతేడాది కుమారుడిని, ప్రస్తుతం భర్తను కోల్పోయిన రామాంజినమ్మ కన్నీటి పర్యంతమైంది. ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు