Share News

TDP: నూతన పార్లమెంటులో టీడీపీ పార్లమెంటరీ పార్టీకి నూతన కార్యాలయం

ABN , Publish Date - Sep 12 , 2024 | 11:55 AM

ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా తెలుగు దేశం పార్టీకి నూతన పార్లమెంటులో నూతన కార్యాలయం కేటాయించారు. ప్రస్తుత లోక్‌సభలోని వివిధ పార్టీలకు పార్లమెంటరీ పార్టీ కార్యాలయాల కేటాయింపులో భాగంగా టీడీపీకి కేటాయింపు జరిగింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది.

TDP: నూతన పార్లమెంటులో టీడీపీ పార్లమెంటరీ పార్టీకి నూతన కార్యాలయం

ఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగు దేశం పార్టీకి నూతన పార్లమెంటులో నూతన కార్యాలయం కేటాయించారు. ప్రస్తుత లోక్‌సభలోని వివిధ పార్టీలకు పార్లమెంటరీ పార్టీ కార్యాలయాల కేటాయింపులో భాగంగా టీడీపీకి కేటాయింపు జరిగింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పార్లమెంటు మొదటి అంతస్తులో తెలుగుదేశం పార్టీకి కార్యాలయం ఇచ్చినట్టు తెలిపింది. మొదటి అంతస్తులోని ఎఫ్09 నుంచి ఇకపై టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. నూతన పార్లమెంటు మొదటి అంతస్తులో ప్రధాని, కేంద్ర మంత్రుల కార్యాలయాలు ఉన్నాయి.


గతంలో పాత పార్లమెంటులో (సంవిధాన్ సదన్) టీడీపీపీ కార్యాలయం ఉండేది. కాగా పాత పార్లమెంటు ప్రాంగణంలో ఇప్పటికీ కొనసాగుతున్న కార్యాలయాలలోనే ఇక ముందు కూడా కొనసాగేందుకు అనేక పార్టీల మొగ్గు చూపాయి. దీంతో ఆయా పార్లమెంటరీ పార్టీల విజ్ఞప్తి మేరకు బీజేపీ, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్ యునైటెడ్ సహా పది పార్టీలకు ఆ కార్యాలయాలనే లోక్ సభ సెక్రటేరియట్ కేటాయించింది.

Updated Date - Sep 12 , 2024 | 11:57 AM