మద్యం షాపుల బంద్ వాయిదా
ABN , Publish Date - Sep 05 , 2024 | 03:18 AM
మద్యం షాపుల్లో పనిచేస్తున్న సూపర్‌వైజర్లు, సేల్స్‌మన్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో ఈనెల 7 నుంచి చేపట్టదలచిన బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్టు,
వరదల నేపథ్యంలో నిర్ణయం: ఉద్యోగుల సంఘం
అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): మద్యం షాపుల్లో పనిచేస్తున్న సూపర్‌వైజర్లు, సేల్స్‌మన్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో ఈనెల 7 నుంచి చేపట్టదలచిన బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రామచంద్రరావు, జి.కోటేశ్వరరావు బుధవారం తెలిపారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో బంద్‌ను వాయిదా వేసినట్టు పేర్కొన్నారు.