Share News

నిబంధనలు పాటించని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:17 PM

నిబంధనలు పాటించని ప్రైవేట్‌ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షులు దినే్‌షకుమార్‌ పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

నిబంధనలు పాటించని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి

ఆత్మకూరు, సెప్టెంబరు 15: నిబంధనలు పాటించని ప్రైవేట్‌ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షులు దినే్‌షకుమార్‌ పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల పాటు పాఠశాలలకు వరుస సెలవులు ఉన్నప్పటికి పలు ప్రైవేట్‌ పాఠశాలలకు నిబంధనలకు విరుద్ధంగా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల విద్యార్థులకు ఒత్తిళ్లకు గురవుతున్నట్లు చెప్పారు. కాగా ప్రైవేట్‌ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ సంబంధిత విద్యాశాఖాధికారులు పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి నిబంధనలు పాటించని ప్రైవేట్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు దిలీప్‌, బాబు, అంజి, రవి, భరత, నవీన తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 11:17 PM