నకిలీ ఔషధ విక్రయాలపై చర్యలు
ABN , Publish Date - Nov 30 , 2024 | 03:20 AM
రాష్ట్రంలో అనుమతి లేని, గడువు ముగిసిన మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు.
2,599 రకాల మందులు సీజ్: విజిలెన్స్ డీజీ
అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అనుమతి లేని, గడువు ముగిసిన మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ నెల 23 నుంచి 27 వరకూ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో విజిలెన్స్ బృందాలు ఆయుష్ అధికారులతో కలిసి సోదాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఎక్కువగా గడువు తీరిన మందులు, విక్రయానికి అనుమతి లేని ఔషధాలు లభ్యమైనట్లు చెప్పారు. మొత్తం 50 ప్రాంగణాల్లో రూ.61 లక్షలకు పైగా విలువైన 2,599 రకాల మందులు స్వాధీనం చేసుకుని వాటిని విక్రయిస్తున్న మెడికల్ షాపులను సీజ్ చేసినట్లు గుప్తా వివరించారు. బాధ్యులపై కేసులు నమోదు చేసి నంద్యాల, తిరుపతి కోర్టుల్లో అభియోగాలు దాఖలు చేశామని తెలిపారు. సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై నిఘా పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ డీజీ హెచ్చరించారు.