Share News

ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:05 AM

ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి

54 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యం, పోక్సో కేసు నమోదు

నల్లజర్ల, సెప్టెంబరు 15: ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సుభద్రపాలెం గ్రామానికి చెందిన ఉన్నమట్ల వెంకట నాగేశ్వరరావు(54) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి పూటుగా మద్యం తాగి వచ్చి తన ఇంటి సమీపంలో ఉండే ఓ ఇంట్లోకి ప్రవేశించి తల్లి పక్కనే నిద్రిస్తున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడాడు. బాలిక తీవ్రంగా ప్రతిఘటించి తల్లిని అప్రమత్తం చేసింది. ఇద్దరు కలిసి ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయమై బాధితులు గ్రామ పెద్దలకు తెలిపినా న్యాయం జరగకపోవడంతో శనివారం రాత్రి నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ శ్రీహరి ఆదివారం ఉదయం గ్రామానికి వెళ్లి విచారించారు. అనంతరం నాగేశ్వరరావుపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌ పేర్కొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 03:05 AM