ఐదున్నర నెలల్లో 50 వేల కోట్ల అప్పు
ABN , Publish Date - Sep 16 , 2024 | 03:15 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐదున్నర నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.50,000 కోట్ల అప్పులు చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ 4వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది.
జూలై వరకు 43 వేల కోట్లు తెచ్చారన్న కాగ్
(అమరావతి-ఆంధ్రజ్యోతి):
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐదున్నర నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.50,000 కోట్ల అప్పులు చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ 4వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రెండు ప్రభుత్వాలు కలిపి ఇప్పటి వరకు రూ.50,000 కోట్ల అప్పులు తెచ్చాయి. ఏప్రిల్ నుంచి జూలై వరకు రూ.43,000 కోట్లు అప్పులు తెచ్చినట్టు కాగ్ నివేదిక వెల్లడించింది. ఆగస్టులో రూ.3,000కోట్లు, సెప్టెంబరులో రూ.4,000కోట్లు తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 6 నెలలకు(ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు) రూ.47,000 కోట్ల అప్పులకు అనుమతివ్వగా, ఆ పరిమితి దాటి అదనంగా రూ.3,000 కోట్లు అప్పు తెచ్చారు. ఆర్థికశాఖ మాత్రం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ రూ.44,000 కోట్ల అప్పులు తెచ్చామని, ఇంకో రూ.3,000 కోట్లు అప్పులు తెచ్చుకునే అవకాశం ఉందని చెబుతోంది.