నేటి నుంచి అన్నారం ఉర్సు

ABN , First Publish Date - 2023-02-07T00:28:10+05:30 IST

వరంగల్‌ జిల్లా పర్వ తగిరి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నారంషరీఫ్‌ యాకూబ్‌షావళి దర్గాలో ఉర్సు ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది తర లిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపడుతున్నట్లు వక్ఫ్‌బో ర్డు ఇన్‌స్పెక్టర్‌ రియాజ్‌పాషా తెలిపారు. వక్ఫ్‌బో ర్డు నుంచి రూ.7 లక్షలు మంజూరు కావడంతో ఆ నిధులతో ప్రధానదర్గాతో

నేటి నుంచి అన్నారం ఉర్సు

పర్వతగిరి, ఫిబ్రవరి 6 : వరంగల్‌ జిల్లా పర్వ తగిరి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నారంషరీఫ్‌ యాకూబ్‌షావళి దర్గాలో ఉర్సు ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది తర లిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపడుతున్నట్లు వక్ఫ్‌బో ర్డు ఇన్‌స్పెక్టర్‌ రియాజ్‌పాషా తెలిపారు. వక్ఫ్‌బో ర్డు నుంచి రూ.7 లక్షలు మంజూరు కావడంతో ఆ నిధులతో ప్రధానదర్గాతో పాటు మిగతా నాలు గు దర్గాలకు పేయింటింగ్‌ వేయిస్తున్నారు. భక్తు లకు అన్నదానం, తాగునీరు, శానిపేటషన్‌ తదిత ర సౌకర్యాలు కల్పించనున్నారు. గ్రామంలోని యాకూబ్‌షావళి దర్గాతో పాటు గౌస్‌పాక్‌, మహ బూబిమా, గుంశావళి, బోలేషావళి దర్గాలకు రంగులువేసి విద్యుద్దీపాలతో అందంగా అలంక రిస్తున్నారు.

ఏటా రంజాన్‌ నెలలో ఉర్సు ఉత్సవాలను వక్ఫ్‌బోర్డు అధికారులు నిర్వహిస్తారు. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. మొదటి రోజు రాత్రి ఖవ్వాళి గేయాలాపన, గంధం ఊరే గింపు, రెండో రోజు రాత్రి దీపారాధన, భక్తులకు మహాఅన్నదానం, మూడోరోజు ఖత్‌మల్‌ ఖురానా లతో ఉత్సవాలు ముగిస్తారు. మొదటి రోజు గం ధం ఊరేగింపు సందర్భంగా పలువురు ప్రముఖు లు దర్గాననుదర్శించుకోనున్నారు. దర్గాకు ముస్లిం లతో పాటు హిందువులు సైతం అధిక సంఖ్యలో మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోం ది. భక్తులు గ్రామంలో విడిది చేసి కోళ్లు, యాట లతో దేవుడికి కందూర్లు చేస్తుంటారు.

Updated Date - 2023-02-07T00:28:12+05:30 IST