ఆడపిల్లలను కాపాడాలి

ABN , First Publish Date - 2023-01-25T00:09:58+05:30 IST

ఆడపిల్లలను కాపాడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి టి.మాధవి అన్నారు.

ఆడపిల్లలను కాపాడాలి
న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి మాధవి

ములుగు కలెక్టరేట్‌, జనవరి 24: ఆడపిల్లలను కాపాడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి టి.మాధవి అన్నారు. జాతీయ బాలికా శిశు దినోత్సవంలో భాగంగా ములుగులోని తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాలలో మంగళవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆడపిల్లలు చదువుకుంటేనే కుటుంబం బాగుంటుందన్నారు. బాలికలు ఉన్నతమైన చదువులు చదివి ఉత్తమమైన జీవితాన్ని పొందాలని ఆకాంక్షించారు. విద్య, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం చదువు, క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఆమె సన్మానించారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బాలుగు చంద్రయ్య, కళాశాల ప్రిన్సిపాల్‌ శారద, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి ప్రేమలత, డీసీపీవో ఓంకార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:09:58+05:30 IST