నగరంలో ‘ఆపరేషన్‌ జంజీర్‌’

ABN , First Publish Date - 2023-02-02T00:04:15+05:30 IST

వరంగల్‌ ట్రైసిటీ్‌సలో రోడ్లపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేదుకు వరంగల్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఆపరేషన్‌ జంజీర్‌కు శ్రీకారం చుట్టారు. వరంగల్‌ సీపీ రంగనాథ్‌ ఆదేశాల మేరకు వరంగల్‌, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో ఆపరేషన్‌ జంజీర్‌ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

నగరంలో ‘ఆపరేషన్‌ జంజీర్‌’

మూడు పట్టణాల్లో ప్రారంభించిన పోలీసులు

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు

హనుమకొండ క్రైం, ఫిబ్రవరి 1: వరంగల్‌ ట్రైసిటీ్‌సలో రోడ్లపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేదుకు వరంగల్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఆపరేషన్‌ జంజీర్‌కు శ్రీకారం చుట్టారు. వరంగల్‌ సీపీ రంగనాథ్‌ ఆదేశాల మేరకు వరంగల్‌, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో ఆపరేషన్‌ జంజీర్‌ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తోపుడుబండ్ల వ్యాపారుల నుంచి ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడకుండా హైదరాబాద్‌ తరహాలో ఆపరేషన్‌ జంజీర్‌ పని చేస్తుందని పోలీసు అధికారులు వెల్లడించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తోపుడు బండ్ల వ్యాపారులు వ్యాపారం నిర్వహించుకున్న తర్వాత సాయంత్రం ఇళ్లకు వెళ్లే సమయంలో బండ్లను ఒక చోట పార్కింగ్‌ చేసి తాళం చెవులను పోలీసులకు అప్పగించి వెళ్లాలి. తిరిగి మర్నాడు పోలీసుల వద్దకు వెళ్లి తాళం చెవులను తీసుకుని వ్యాపారం నిర్వహించుకోవాలి. ఈ మేరకు బుధవారం ఆపరేషన్‌ జంజీర్‌ను వరంగల్‌ ట్రాఫిక్‌ సీఐ బాబులాల్‌, హనుమకొండ సీఐ రవికుమార్‌, కాజీపేట సీఐ రామకృష్ణలు ప్రారంభించారు. పోలీసులతో పాటు ప్రజాప్రతినిధులు, పండ్ల వర్తక సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:04:17+05:30 IST