ఉల్లాసంగా.. ఉత్సాహంగా...

ABN , First Publish Date - 2023-02-01T00:06:43+05:30 IST

రాష్ట్ర ఐటీ, మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో పర్యటించారు.

ఉల్లాసంగా.. ఉత్సాహంగా...

కమలాపూర్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటన సక్సెస్‌

రూ.49 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

ఘనంగా స్వాగతం పలికిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు

విద్యార్థినులతో మమేకం.. సరదాగా సంభాషణ..

కమలాపూర్‌, జనవరి 31 : రాష్ట్ర ఐటీ, మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. విద్యార్థులతో మమేకమయ్యా రు. వారితో సరదాగా సంభాషించారు. సహపంపక్తి భోజ నం చేశారు. కేటీఆర్‌కు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలకడంతో కమలాపూర్‌లో పెద్ద ఎత్తున సందడి కనిపించింది. అయితే ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు కేటీఆర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆగ్రహించాయి. ఆందోళనకారులను పట్టుకొని పోలీసుల ముందే చితకబాదారు. ఈ సంఘటనతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

మంత్రి కేటీఆర్‌ కరీంనగర్‌ నుంచి హెలీకాప్టర్‌లో ఉదయం 11.36 గంటలకు కమలాపూర్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగు ల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి గెల్లు శ్రీనివా్‌సయాదవ్‌లతో కలిసి 12.10 గంటలకు ర్యాలీగా బయలు దేరి తహసీల్దార్‌ కార్యాలయం చేరుకున్నారు. మహిళలు బతుకమ్మలు, బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ ఏర్పా టు చేసిన జర్నలిస్టుల డబుల్‌బెడ్‌రూం ఇళ్ల సముదా యం, బస్టాండ్‌, ఎస్సీ కమ్యూనిటీ ఫంక్షన్‌ హాల్‌, మార్కండేయ ఆలయ నిర్మాణం, గౌడ సంఘం కమ్యూనిటీ హాల్‌ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

అనంతరం రైతు వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన పది కులసంఘాల భవన సముదాయాలను ప్రారంభించారు. అక్కడ నుంచి నేరుగా ఎంజేపీ బీసీ బాలికల గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. అక్కడ ఎంజేపీ బీసీ బాలుర, బాలికల గురుకుల పాఠశాలలను, కేజీబీవీ జూనియర్‌ కళాశాల భవనం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాలను ప్రారంభించారు. అనంతరం ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం 2గంటలకు భోజనం చేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం మధ్యాహ్నం 3.27 గంటలకు రోడ్డు మార్గం ద్వారా కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటకు బయలు దేరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌బాబు, మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌, కరీంనగర్‌ జడ్పీ చైర్మన్‌ కునుమల్ల విజయ, హనుమకొండ జడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌, మేయర్‌ గుండు సుధారాణి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, సీపీ రంగనాథ్‌, ‘కుడా’ చైర్మన్‌ సుందర్‌ రాజ్‌యాదవ్‌, ఎమ్మెల్సీ నరోత్తంరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కానరాని ఎమ్మెల్యే, ఎంపీ

కమలాపూర్‌ ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలల ప్రారంభం సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలపై స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఫొటోలు లేకపోవడం చర్చనీయాంశమైంది.

కేటీఆర్‌ మా మధ్య కూర్చుంటారని ఊహించలేదు..

‘మంత్రి కేటీఆర్‌ను టీవీల్లో, పేపర్‌లో చూసేవాళ్ళం.. ఇంత దగ్గరగా చూస్తామని కలలో కూడా అనుకోలేదు.. ఆయన ఇంగ్లీష్‌లో మాట్లాడే తీరు మాకు బాగా నచ్చుతుంది. అన్ని విషయాలు బాగా మాట్లాడుతాడు.. నిజానికి కేటీఆర్‌కు మరో దగ్గర సీటు వేశారు. దారిలో మా మధ్య నుంచి వెళుతుంటే చూసే అవకాశం దక్కుతుందనుకున్నాం.. ఏకంగా మా మధ్యలోనే వచ్చి కూర్చుంటారని ఊహించలేదు.. మాకు చాలా సంతోషంగా ఉంది..’ అని కమలాపూర్‌ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల 8వతరగతి విద్యార్థులు వర్షిత, శ్రీనిధి రక్షితలు అన్నారు. మంగళవారం కమలాపూర్‌లో మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలను ప్రారంభించిన అనంతరం కేటీఆర్‌ విద్యార్థినిలతో కలిసి భోజనం చేశారు. వారితో సంభాషించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినిలు సంతోషం వ్యక్తం చేశారు.

‘మీరు మాట్లాడలేక పోతే ఎట్లా..? ఏమైనా కావాలా.. చెప్పండి..? అంటూ మంత్రి అడిగిన తీరు మాకు చా లా నచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా ఆడపిల్లలు గట్టి గా అడగాలి.. అంటూ చెప్పడంతో మాకు ధైర్యం వచ్చింది. అడగందీ అమ్మయినా పెట్టదు కదా.. అనడంతో ధైర్యం చేశాం.. మాకు రాజకీయ నాయ కులు అంటే ఇట్లా ఉంటారా.. అనిపించింది.. మేం అడగానే కంప్యూటర్‌ ల్యాబ్‌, వాటర్‌హీటర్‌ను మం జూరు చేశారు. హైదరాబాద్‌ ఐట్‌హబ్‌కు తీసుకెళ తానన్నారు. డ్రోన్‌ గురించి చెప్పిన తీరు మాకు బాగా నచ్చింది.. డ్రోన్‌ అంటే ఫొటోలు వీడియోలు మాత్రమే తీయడానికి పనికి వస్తుందని తెలుసు. ఇన్ని ఉపయోగాలున్నాయని తెలియదు..’ అని వర్షిత, శ్రీనిధి, అక్షితలు సంతోషం వ్యక్తం చేశారు.

నిరసనకు దిగిన ఎన్‌ఎస్‌యూఐ

కమలాపూర్‌లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేయడానికి ర్యాలీగా వస్తున్న మంత్రి కేటీఆర్‌ను ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు అడ్డుకునేందుకు యత్నించారు. ‘కేటీఆర్‌ గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేస్తూ నల్లజెండాలతో అడ్డుకునేందుకు యత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎన్‌ఎ్‌సయూఐ నాయకులపై బీఆర్‌ఎస్‌ నాయకులు దాడిచేశారు. వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తలించారు. కాగా, మంత్రి కేటీఆర్‌ పర్యటన ర్యాలీని అడ్డుకునేందుకు యత్నించిన 13 మంది ఎన్‌ఎ్‌సయూఐ నాయకులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసు ఇన్స్‌పెక్టర్‌ సంజీవ్‌ తెలిపారు.

ప్రొటోకాల్‌ విస్మరించిన అధికారులు

హనుమకొండ టౌన్‌, జనవరి 31: కేటీఆర్‌ కమలాపూర్‌ పర్యటన ఆద్యంతం పార్టీ కార్యక్రమంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, ఎంపీ బండి సంజయ్‌ హాజరు కాలేదు. వీరిద్దరికీ అధికారికంగా సమాచారం లేదని తెలుస్తోం ది. తనకు సమాచారం లేదని ఎమ్మెల్యే ఈటల తెలిపారు. ఇదిలా ఉంటే మహాత్మా జ్యోతిరావుపూలే పాఠశాల ఎదుట ఉపాధ్యాయుల పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సైతం ఎమ్మెల్యే, ఎంపీ ఫొటోలు కనిపించలేదు. అధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఫొటోలు పెట్టకపోవడం విమర్శలకు తావిచ్చినట్లయింది.

Updated Date - 2023-02-01T00:06:45+05:30 IST