పథకాలు ప్రజలకు అందేలా చూడాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-02-07T00:29:13+05:30 IST

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్‌ బి.గోపి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను వినతి పత్రం ద్వారా అందించారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయా సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్‌ తెలిపారు. మొత్తం 43 వినతి పత్రాలు రాగా ఇందులో భూమికి సంబంధించినవి 11, విద్యాశాఖ ఒకటి, ఎంజీఎం ఒకటి, ఎస్సీ కార్పొరేషన్‌ ఆరు, డీఆర్‌డీవో ఒకటి, మున్సిపాలిటీ మూడు, పోలీసు కమిషనర్‌ రెండు, నర్సంపేట ఆర్‌డీవో ఒకటి, కార్మిక శాఖ నాలుగు, పశు సంవర్ధక శాఖ ఒకటి, ఆర్‌ అండ్‌ బీ ఒకటి, విద్యుత్‌ ఒకటి, ఏడీ సర్వే రెండు, సబ్‌ రిజిస్ట్రార్‌ ఒకటి, మైన్స్‌ మూడు, ఇరిగేషన్‌ ఒకటి, నర్సంపేట మున్సిపాలిటి ఒకటి దరఖాస్తులను ఆయా శాఖలకు బదిలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు కె.శ్రీవత్స, అశ్విని తనాజీ వాకడే, డీఆర్‌డీ పీడీ సంపత్‌రావు, వివిధ శాఖల

పథకాలు ప్రజలకు అందేలా చూడాలి: కలెక్టర్‌

వరంగల్‌ కలెక్టరేట్‌, ఫిబ్రవరి 6: ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్‌ బి.గోపి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను వినతి పత్రం ద్వారా అందించారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయా సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్‌ తెలిపారు. మొత్తం 43 వినతి పత్రాలు రాగా ఇందులో భూమికి సంబంధించినవి 11, విద్యాశాఖ ఒకటి, ఎంజీఎం ఒకటి, ఎస్సీ కార్పొరేషన్‌ ఆరు, డీఆర్‌డీవో ఒకటి, మున్సిపాలిటీ మూడు, పోలీసు కమిషనర్‌ రెండు, నర్సంపేట ఆర్‌డీవో ఒకటి, కార్మిక శాఖ నాలుగు, పశు సంవర్ధక శాఖ ఒకటి, ఆర్‌ అండ్‌ బీ ఒకటి, విద్యుత్‌ ఒకటి, ఏడీ సర్వే రెండు, సబ్‌ రిజిస్ట్రార్‌ ఒకటి, మైన్స్‌ మూడు, ఇరిగేషన్‌ ఒకటి, నర్సంపేట మున్సిపాలిటి ఒకటి దరఖాస్తులను ఆయా శాఖలకు బదిలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు కె.శ్రీవత్స, అశ్విని తనాజీ వాకడే, డీఆర్‌డీ పీడీ సంపత్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ వద్ద రైతుల నిరసన

భూమి పట్టాలు ఇవ్వ కుండా నాలుగేళ్లుగా ప్ర భుత్వం జాప్యం చేస్తోంద ని ఆరోపిస్తూ నల్లబెల్లి మండలానికి చెందిన క న్నారావుపేట, బుచ్చిరెడ్డి పల్లి, ధర్మపురం, రామతీ ర్థం, మూడుచెక్కలపల్లి, పంతులపురం గ్రామాల కు చెందిన వంద మంది రైతులు సోమవారం జిల్లా కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. 840 మందికి చెందిన 1800 ఎకరాల భూమిలో 700 ఎకరాలను భూమిని 2019లో పట్టాల ద్వారా పంచగా మిగతా 1100 ఎకరాల భూమిని ప్రభుత్వం పంచకుండా రికార్డుల్లో తప్పులు ఉన్నాయంటూ కాలయాపన చేస్తున్నారని రైతు సమన్వయ సమితి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. గతంలో కలెక్టర్‌ గ్రామాలను సందర్శించి విషయాన్ని తెలుసుకొని రైతులకు న్యాయం చేస్తానని తెలిపారని, ఇప్పటి వరకు కూడా కలెక్టర్‌ సందర్శించలేదన్నారు. దీంతో నిరసన చేపట్టాల్సి వచ్చిందని వాపోయారు.రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న కలెక్టర్‌ రైతుల వద్దకు వచ్చి బుధవారం గ్రామాలకు వస్తానని, పరిస్థితిని సమీక్షించి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో శాంతించారు.

Updated Date - 2023-02-07T00:29:14+05:30 IST