కోల్‌ రైల్‌కు పచ్చజెండా

ABN , First Publish Date - 2023-02-05T00:51:16+05:30 IST

కోల్‌ రైల్‌కు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. బడ్జెట్‌లో నిధు లు కేటాయిస్తూ కొత్త లైన్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

కోల్‌ రైల్‌కు పచ్చజెండా

పింక్‌ బుక్‌లెట్‌లో పేర్కొన్న రైల్వే శాఖ

రామగుండం నుంచి మణుగూరు వరకు 200కి.మీ లైన్‌

రూ.2,911 కోట్ల పనులకు గ్రీన్‌ సిగ్నల్‌

2013-14 ప్రతిపాదనలకు మోక్షం

పట్టాలెక్కనున్న టూరిజం అభివృద్ధి!

భూపాలపల్లి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): కోల్‌ రైల్‌కు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. బడ్జెట్‌లో నిధు లు కేటాయిస్తూ కొత్త లైన్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రైల్వే శాఖ విడుదల చేసిన పింక్‌బుక్‌లో ఈమేరకు పేర్కొంది. రామగుండం- మణుగూరు రైల్వే లైన్‌కు తొలి విడత రూ.10 వేల కోట్ల నిధులు కేటా యించింది. దీంతో 2013-14లోని ప్రతిపాదనలకు ఎట్టకే లకు మోక్షం లభించినట్టయ్యింది. పాతికేళ్లుగా రైల్వేలైన్‌ కోసం ఎదురుచూస్తున్న భూపాలపల్లి జిల్లా వాసుల కల నెరవేరుతుంది. కేవలం బొగ్గు రవాణాకే కాకుండా భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉన్న ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ఈ రైల్వేలైన్‌ వారధిగా మారనుంది.

ఈనెల 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో రామగుండం- మణుగూరు రైల్వే లైన్‌కు ఎట్టకే లకు మోక్షం లభించింది. ఈసారి అత్యధికంగా రూ.2.40 లక్షల కోట్ల రైల్వే బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. దీంతో పాటు బొగ్గు, పర్యాటక ప్రాంతాలను కనెక్టివిటీ చూస్తూ భారీగా రైల్వేలైన్లు నిర్మిస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటు సమావేశాల్లో ప్రకటించారు. అయితే.. రైల్వే బడ్జెట్‌కు సంబంధించి ఏ ప్రాజెక్టు ఎన్ని నిధులు కేటాయించారో పేర్కొంటూ పింక్‌బుక్‌లెట్‌లో ఆ శాఖ శుక్రవారం పేర్కొంది. అందులో పెద్దపల్లి జిల్లా రామగుండం నుంచి భూపాలపల్లి, రామప్ప, మేడారం మీదుగా మణుగూరు వరకు 200కిలో మీటర్ల రైల్వేలైన్‌ నిర్మిస్తున్నట్టు వివరించారు. తొలి విడతగా రూ.10వేల కోట్ల నిధులను కేటాయించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాల్లో బడ్జెట్‌ సవరణలో ఈ నిధులు ఇంకా పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి.

పాతికేళ్ల తర్వాత...

భూపాలపల్లి కోల్‌ ఏరియాకు రైల్వేలైన్‌ నిర్మాణం చేపట్టాలని డిమాండు 1998 నుంచి ఉంది. అప్పటి నుంచి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 1999లో అప్పటి బీజేపీ ప్రభుత్వం ‘రైట్‌’’ అనే సంస్థ ద్వారా జమ్మికుంట నుంచి భూపాలపల్లి వరకు రైల్వే లైన్‌ నిర్మాణం కోసం రూట్‌ సర్వే చేయించింది. ఆ తర్వాత బొగ్గు ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేకంగా రైల్వేలైన్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. అదే ఏడాది ‘రైట్‌’ సంస్థతో రామగుండం నుంచి భూపాలపల్లి మీదుగా మణుగూరు వరకు రైల్వే నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. అప్పటికే బీజేపీ ప్రభుత్వ పడిపోవటంతో ఈ ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. దీంతో 2013-14లో మరోసారి రామగుండం- మణగూరు రైల్వే లైన్‌ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వా నికి రైట్‌ సంస్థ చేసిన ప్రతిపాదనలను రైల్వే శాఖ పంపించింది. ఆ ఏడాది సర్వే చేయగా 200 కిలో మీట ర్ల రైల్వే లైన్‌కు రూ. రూ.1,112 కోట్లతో ఈ రైల్వే లైన్‌ నిర్మించొచ్చనని ప్రతిపాదన చేశారు. అయితే అప్పటి నుంచి ఈ లైన్‌ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే తొమ్మదేళ్లలో బడ్జెట్‌ వ్యయం రూ.1,112కోట్ల నుంచి రూ.2,911 కోట్లకు పెరిగింది. అంటే.. రూ.1,799 కోట్లు అదనపు వ్యయం అన్నమాట. ఈ నేపథ్యంలో తొలుత కేటాయించిన రూ.10వేల కోట్లతో భూసేకరణ, అటవీ శాఖ అనుమ తులు తదితర పనులు చేపట్టనున్నారు. రానున్న మూ డేళ్లలో మొత్తం రైల్వే పనులు పూర్తి చేసి కోల్‌ రైల్‌ను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం సింగిల్‌ లైన్‌కే పరిమితం అయినప్పటికీ భవి ష్యత్తులో కాజీపేట జంక్షన్‌ నుంచి భూపాలపల్లి వరకు రైల్వేలైన్‌ నిర్మించి, ఈ లైన్‌కు లింకు చేస్తారని, దీంతో హైదరాబాద్‌, ఢిల్లీ తదితర సుదూర ప్రాంతాలకు రైల్‌ ప్రయాణం భూపాలపల్లి, ములుగు జిల్లా వాసులకు దక్కుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

విద్యుత్‌ ఉత్పత్తికి బొగ్గు సరఫరా

రైల్వే లైన్‌ నిర్మాణంతో రామగుడం నుంచి భూపాల పల్లి మీదుగా మణుగూరు వరకు ఽథర్మల్‌ పవర్‌ ప్రాజె క్టులకు బొగ్గు సరఫరా సులభం కానుంది. ప్రస్తుతం భూపాలపల్లిలోని కేటీపీపీకి బొగ్గును రామగుండం నుం చి రైల్‌ ద్వారా హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండ లం ఉప్పల్‌ రైల్వేస్టేషన్‌కు దిగుమతి చేసుకుంటున్నారు. ఉప్పల్‌ నుంచి 70కిలో మీటర్లు పరకాల మీదుగా కేటీపీపీకి బొగ్గును సరఫరా చేస్తున్నారు. దీంతో అధిక వ్యయంతోపాటు సకాలంలో కేటీపీపీకి చేరటం లేదు. ఇలాంటి పరిస్థితే మరిన్ని బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్రాలకు ఉంది. ఈ రైల్వేలైన్‌ నిర్మాణంతో బొగ్గు సరఫరా కష్టాలకు ఇక చెక్‌పడనుంది. ఈ రైల్వేలైన్‌ ఏరి యాలోనే రామగుడం సమీపంలోని 2,600 మెగావాట్ల ఎన్‌టీపీసీ విద్యుత్‌ కేంద్రంతోపాటు 1,600 మెగావాట్ల తెలంగాణ ఎన్‌టీపీసీ ప్రాజెక్టు, అలాగే జైపూర్‌లోని జెన్‌కోకు చెందిన 6,200 మెగావాట్లు రామగుండంలో, 11మెగావాట్లు విద్యుత్‌ కేంద్రాలు భూపాలపల్లిలో ఉన్నా యి. మణుగూరు సమీపంలోని 1,200 మెగావాట్ల భద్రా ద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు కూడా రైల్‌మార్గం అందు బాటులో లేదు. రామగుండం నుంచి మణుగూరు వరకు నిర్మించే ఈ రైల్వేలైన్‌ అందుబాటు లోకి రానుంది. దీంతో బొగ్గు సరఫరా ఈ పరి శ్రమలకు సులభతరం కానుంది. ఎం తో కీలకమైన ఈ ప్రాజెక్టు కోసం జెన్‌కో సంస్థ కూడా కోల్‌ రైల్వే లైన్‌ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చింది

పర్యాటకానికి పండగే..!

కొత్త రైల్వేలైన్‌తో పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడనుందని తెలుస్తోంది. రామగుడం నుంచి మణుగూరు వరకు అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నా యి. వీటన్నింటినీ లింకు చేసుకుంటూ లైన్‌ నిర్మాణం చేయనున్నారు. ప్రధానంగా పెద్దపల్లి జిల్లా రామగుం డం నుంచి కాళేశ్వరం, భూపాలపల్లి మీదుగా ములుగు జిల్లా రామప్ప, మేడారం, లక్నవరం, ఏటూరునాగారం అభయారణ్యం, బొగత, మల్లూరు తదితర పుణ్యక్షేత్రా లు, పర్యాక కేంద్రాలకు సమీపం నుంచి మణుగూరు వరకు రైల్వే లైన్‌ నిర్మాణం సాగనుంది. ఈ మేరకు వ్యాప్కో సంస్థతో ఈ రూట్‌లో లైన్‌ నిర్మాణం కోసం సర్వే చేయించారు. గత ఏడాది అక్టోబరులో ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలో మట్టి నమూనాలు సేకరించారు. డీపీఆర్‌ను తయారు చేసిన రైల్వే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతరకు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ర్టాలతోపాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాల నుంచి కూడా భక్తులు మేడారం వచ్చేందుకు ఈ రైల్వేలైన్‌ ఉపయోగపడు తుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే రామప్ప కు యునెస్కో గుర్తింపు వచ్చిన నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ప్రయాణం సులభం కానుందని తెలుస్తోంది. ఈ రైల్వేలైన్‌ పర్యాటకులను మరింత ఆకర్షించేందు కు ఉపయోగప డుతుందనే అభిప్రాయాలు వ్యకవుతున్నాయి. కాళేశ్వ రం, రామప్ప, లక్నవరం, బొగత తదితర ప్రాంతాలకు పర్యాటకులను చేరేవేసే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2023-02-05T00:51:21+05:30 IST