ప్రజాస్వామ్యంలో ఓటరుదే కీలకపాత్ర

ABN , First Publish Date - 2023-01-26T01:23:06+05:30 IST

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరుదే కీలకపాత్ర అని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో బుధవారం జరిగిన కార్యక్రమంలో మా ట్లాడారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగిం చుకోవాలని కో రారు. 18సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటరుదే కీలకపాత్ర

కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌

సూర్యాపేటఅర్బన్‌, జనవరి 25: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరుదే కీలకపాత్ర అని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో బుధవారం జరిగిన కార్యక్రమంలో మా ట్లాడారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగిం చుకోవాలని కో రారు. 18సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓటరుకార్డును ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసేందుకు నిర్ణయించిందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేంద్రకుమార్‌, తహసీల్దార్‌ వెంకన్న పాల్గొన్నారు.

ఓటు నమోదు చేసుకోవాలి : ఎస్పీ

సూర్యాపేటక్రైం: ప్రజాస్వామ్యంలో ఓటు విలువైందని 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎస్పీ రాజేందరప్రసాద్‌ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సంఘం ఈపిక్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. జిల్లాలో ఓ టరు నమోదుకు అధికారులు యువతలో చైతన్యం కల్పించాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర్‌రెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, ఏవో సురేష్‌బాబు, శ్రీని వాస్‌, నర్సింహ, సీఐలు సోమనారాయణసింగ్‌, శివశంకర్‌, ప్రసాద్‌, ఆంజనేయులు, రాజశేఖర్‌, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ గౌరి నాయుడు, ఆర్‌ఐలు శ్రీనివాస్‌, శ్రీనివాస్‌రావు, గోవిందరావు, సెక్షన్‌ సూపరింటెండెంట్‌ శ్రీకాంత్‌, ఎస్‌ఐలు రవిందర్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం

సూర్యాపేటఅర్బన్‌, జనవరి 25: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగు తుందని కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌కేశవ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన క్రికెట్‌ పోటీలను ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి బుధవారం పాల్గొన్నారు. అధికారులు విధి నిర్వహణలో ఒత్తిడికి గురవుతారని, ఇలాంటి క్రీడలతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో పీడీ కిరణ్‌కుమార్‌, ఆర్డీవో రాజేంద్రకుమార్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి రామారావునాయక్‌, జిల్లా క్రీడల అధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T01:23:06+05:30 IST