భక్తిశ్రద్ధలతో వేంకటేశ్వరస్వామి కల్యాణమహోత్సవం

ABN , First Publish Date - 2023-02-07T00:47:20+05:30 IST

అనుముల మండలం మారేపల్లి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భా గంగా సోమవారం స్వామివారి తిరు క ల్యాణ మహోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు.

 భక్తిశ్రద్ధలతో వేంకటేశ్వరస్వామి కల్యాణమహోత్సవం
స్వామివారి కల్యాణమహోత్సవాన్ని నిర్వహిస్తున్న అర్చకులు

భక్తిశ్రద్ధలతో వేంకటేశ్వరస్వామి కల్యాణమహోత్సవం

హాలియా, ఫి బ్రవరి 6: అనుముల మండలం మారేపల్లి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భా గంగా సోమవారం స్వామివారి తిరు క ల్యాణ మహోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం గజవాహన సేవ, ఆరగింపు, భక్తులకు తీర్థప్రసాదం వినియోగం నిర్వహించారు. కందాల శ్రీనాధుల దాతృత్వంతో భక్తులకు అన్నదాన కా ర్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవంలో భాగంగా మంగళవారం రథోత్స వం, బుధవారం నవకలాభిషేకం, చక్రతీర్థం నిర్వహించనున్నటు ఆలయ ఈవో నాగిరెడ్డి తెలిపారు. రాత్రి వేళలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కల్యాణమహోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో చైర్మన గడిద శ్రీకాంతయాదవ్‌, సర్పంచ గుండెబోయిన వెంకన్నయాదవ్‌, ఆలయ అర్చకులు శేషాచార్యులు, అభివృద్ధి క మిటీ సభ్యులు బొమ్మపాల వెంకటయ్య, వెంకయ్య, పద్మ, మల్లేష్‌, శివ, శంకర య్య, శేషాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:47:21+05:30 IST