Revanth: వైఎస్ఆర్‌కు చేవెళ్ల చెల్లమ్మ సెంటిమెంట్‌ అయితే..: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-02-06T20:19:42+05:30 IST

వైఎస్ఆర్‌కు చేవెళ్ల చెల్లమ్మ సెంటిమెంట్‌ అయితే.. నాకు ములుగు సీతక్క ఇంటి ఆడబిడ్డ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాదయాత్రలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి (Revnth Reddy) మండిపడ్డారు.

Revanth: వైఎస్ఆర్‌కు చేవెళ్ల చెల్లమ్మ సెంటిమెంట్‌ అయితే..: రేవంత్‌రెడ్డి

ములుగు: వైఎస్ఆర్‌కు చేవెళ్ల చెల్లమ్మ సెంటిమెంట్‌ అయితే.. తనకు ములుగు సీతక్క ఇంటి ఆడబిడ్డ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాదయాత్రలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి (Revnth Reddy) మండిపడ్డారు. కేసీఆర్ (CM KCR) ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే తన పాదయాత్ర అన్నారు. తెలంగాణ అమరుల త్యాగాలను కేసీఆర్ సర్కార్ తొక్కాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. రజాకార్లను తరిమిన గడ్డ మౌనంగా ఉంటే ఎలా?, రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగం, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం, ఆదివాసీలకు విద్యదూరం చేయడమేనా సంక్షేమం? అని రేవంత్ ప్రశ్నించారు. ఇదిలావుండగా రేవంత్ రెడ్డి పాదయాత్రకు టీకాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాక్రే, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి హాజరయ్యారు.

కాగా రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy Padayatra) పాదయాత్ర ప్రారంభమైంది. సోమవారం మేడారంలో ‘‘హాత్‌ సే హాత్ జోడో’’ యాత్ర (Hath Se Hath Jodo Yatra)ను టీపీసీసీ చీఫ్ మొదలుపెట్టారు. అంతకుముందు సమ్మక్క - సారలమ్మ గద్దె (Sammakka - Saralamma Gadde)ల వద్దకు వెళ్లిన రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. మేడారం (Medaram)కు వచ్చిన రేవంత్‌కు బాణాసంచా పేల్చి, డోలువాయిద్యాలతో కాంగ్రెస్ శ్రేణులు (Congress) ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో ఎత్తు బంగారాన్ని రేవంత్ తులాభారం వేశారు. సమక్క - సారలమ్మ దర్శనానంతరం టీపీసీసీ చీఫ్ పాదయాత్రను మొదలుపెట్టారు.

Updated Date - 2023-02-06T20:22:31+05:30 IST