దారుణం.. డబ్బు కోసం మైనర్ కూతుళ్లను..

ABN , First Publish Date - 2023-01-24T20:22:32+05:30 IST

జిల్లాలోని మాచారెడ్డి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బు కోసం ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది.

దారుణం.. డబ్బు కోసం మైనర్ కూతుళ్లను..

కామారెడ్డి: జిల్లాలోని మాచారెడ్డి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బు కోసం ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. మైనర్ కూతుళ్లను అమ్మిన సవతి తల్లి, తండ్రి రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులతో పెళ్లి జరిపించారు. అయితే ఆ మైనర్ బాలికలను శారీరకంగా వాడుకుని రాజస్థాన్ వ్యక్తులు వేధింపులకు గురిచేసినట్లు బాధితులు వాపోతున్నారు. మైనర్ బాలికలను పోలీసులు బాలసదన్‌కు తరలించారు. సవతి తల్లి, తండ్రి, పెళ్లి చేసుకున్న ఇద్దరు నిందితులు, సహకరించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2023-01-24T20:22:32+05:30 IST