హైదరాబాద్.. ప్రీ లాంచ్ ఆఫర్లతో మోసాలు

ABN , First Publish Date - 2023-01-25T21:18:13+05:30 IST

ప్రీ లాంచ్ ఆఫర్లతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్.. ప్రీ లాంచ్ ఆఫర్లతో మోసాలు

హైదరాబాద్: ప్రీ లాంచ్ ఆఫర్లతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేపీహెచ్బీ పోలీసులు కాకర్ల శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. జయత్రి ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ లిమిటెడ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫ్లాట్లు కట్టిస్తామని చెప్పి రూ.20 కోట్లు వసూలు చేసినట్లు బాధితులు వాపోతున్నారు. న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అలాగే ఖాళీ స్థలాల యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకుని కస్టమర్ల నుంచి డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. స్థల యజమానులతో కుదుర్చుకున్న ఒప్పందాలు కాకర్ల రద్దు చేసుకున్నట్లు తెలిసింది.

Updated Date - 2023-01-25T21:18:13+05:30 IST