Pawan kalyan పై తెలంగాణ కీలక నేత ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎందుకిలా..!

ABN , First Publish Date - 2023-01-25T19:01:37+05:30 IST

కొండగట్టులో పవన్ చేసిన ప్రసంగానికి కౌంటర్‌గా ఆయన మాట్లాడారు. ‘పవన్ ఎవరితో పొత్తు..

Pawan kalyan పై తెలంగాణ కీలక నేత ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎందుకిలా..!

కరీంనగర్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొండగట్టులో పవన్ చేసిన ప్రసంగానికి కౌంటర్‌గా ఆయన మాట్లాడారు. ‘పవన్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌కు ఏం సంబంధం?. భావసారూప్యత అంటే ఏంటో పవన్‌కే తెలియాలి. పవన్ సిద్ధాంతం ఏంటో మాకు తెలీదు’ అని జీవన్ రెడ్డి కామెంట్స్ చేశారు. అంతేకాదు.. కేసీఆర్ సర్కార్‌పైనా విమర్శలు గుప్పించారు. మహిళల పట్ల కేసీఆర్ సర్కార్ చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు.

Jeevan-Reddy.jpg

పవన్ ఏం మాట్లాడారు..?

కాగా.. నిన్న జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సేనాని మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కీలక ప్రకటన చేశారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లాగా ఈసారి వదిలేయమని.. రాష్ట్రంలో పరిమిత స్థానాల్లోనే పోటీచేస్తామని క్లారిటీ ఇచ్చేశారు.

అంతేకాదు.. తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉండదు కానీ, తన మద్దతు మాత్రం ఉంటుందని చెప్పుకొచ్చారు పవన్. ఎన్నికలప్పుడే పొత్తులపై ఆలోచిస్తామని కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా కలిసి వెళ్తామని.. పొత్తులు కుదరకపోయినా ఒంటరిగానే వెళ్తామని మనసులోని మాటను సేనాని బయటపెట్టారు. దీంతో.. జనసేనానిపై తెలంగాణ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ పవన్ ప్రసంగంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Updated Date - 2023-01-25T19:16:26+05:30 IST