Assembly: తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా

ABN , First Publish Date - 2023-02-04T16:54:39+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సోమవారానికి వాయిదా పడింది. సోమవారం బడ్జెట్‌ (Budget)ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు.

Assembly: తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదా

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సోమవారానికి వాయిదా పడింది. సోమవారం బడ్జెట్‌ (Budget)ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. 7న అసెంబ్లీకి సెలవు. తిరిగి 8న బడ్జెట్‌పై సభలో సాధారణ చర్చ జరుగనుంది. 9, 10, 11 మూడు రోజుల పాటు పద్దులపై చర్చ జరుగనుంది. 12న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ తమిళిసై (Governor Tamilisai) ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Pocharam Srinivas Reddy) చాంబర్‌లో సమావేశమైంది. స్పీకర్‌ అధ్యక్షతన జరిగిన భేటీలో మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి (Harish Rao, Prashanth Reddy), గంగుల కమలాకర్‌, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, కాంగ్రెస్‌ సభా పక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం శాసన సభా పక్ష ఉప నేత పాషాఖాద్రి పాల్గొన్నారు. బీజేపీకి ఆహ్వానం లేకపోవడంతో ఆ పార్టీ సభ్యులు పాల్గొనలేదు. ఈ సందర్భంగా మంత్రులు హరీశ్‌, ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. శనివారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చించుకుందామని చెప్పారు. అనంతరం తీర్మానానికి ముఖ్యమంత్రి సమాధానమిస్తారని, దాంతో తీర్మానం ముగుస్తుందని అన్నారు. ఆదివారం సభకు విరామాన్ని ప్రకటించి, సోమవారం ఉభయ సభల్లో బడ్జెట్‌ ప్రవేశపెడతామని వెల్లడించారు. 25 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలన్న ప్రతిపక్షాల అభ్యర్థనను సర్కార్ పక్కన పెట్టింది. ఈ నెల 12 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2023-02-04T16:55:00+05:30 IST