ట్రాక్టర్ బోల్తాపడి యువకుడి మృతి
ABN , First Publish Date - 2023-01-26T00:31:25+05:30 IST
ట్రాక్టర్ బోల్తా పడడంతో యువకుడు మృతి చెందిన సంఘటన రేగడి చిల్కమర్రిలో జరిగింది.

కొందుర్గు, జనవరి 25: ట్రాక్టర్ బోల్తా పడడంతో యువకుడు మృతి చెందిన సంఘటన రేగడి చిల్కమర్రిలో జరిగింది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. రేగడి చిల్కమర్రికి చెందిన తడకల రాజు(28)ను అదే గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్ బుధవారం ట్రాక్టర్ ఎక్కించుకొని తన పొలానికి వెళ్దామన్నాడు. ప్రేమ్‌కుమార్ ట్రాక్టర్ నడిపాడు. మార్గమధ్య లో ట్రాక్టర్ బోల్తా పడింది. రాజుపై ట్రాక్టర్ ఇంజన్ పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన ప్రేమ్‌కుమార్‌ను మొదట షాద్‌నగర్‌కు , అటు నుంచి మెరుగైన చికిత్సనిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి కి తరలించినట్లు ఎస్సై తెలిపారు. రాజు అవివాహితుడు. అతడి అన్న యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.