ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2023-01-25T00:29:35+05:30 IST

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు.

ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు
గిరిజన మహిళలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌

మర్పల్లి, జనవరి 24 : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బూచన్‌పల్లి అనుబంధ గ్రామమైన జాజుగుబ్బడి తండా, పట్లూర్‌ అనుబంధ గ్రామమైన కట్టెపహాడ్‌ తండా, కొత్తపురం అనుబంధ గ్రామమైన అల్లాపూర్‌ గ్రామాల్లో మీతో నేను కార్యక్రమం నిర్వహించి గ్రామాల్లోని వీధుల్లో పర్యటించి కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలు, మురుగు కాలువలు, పారిశుధ్య పనులపై తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాగా, కట్టెపహాడ్‌ తండాలో ప్రతి నెలా ఇచ్చే రేషన్‌ బియ్యం, పింఛన్‌లు తండాలోనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు వినతి పత్రం అందజేశారు. అల్లాపూర్‌లో తాగునీటి సమస్య, మరుగు దొడ్ల నిర్మాణం, సీసీ రోడ్డు పనులు పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని గ్రామస్థులు కోరారు. జడ్పీటీసీ మధుకర్‌, వైస్‌ ఎంపీపీ మోహన్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌ ఇందిరఅశోక్‌, జయ, ప్రభాకర్‌, పలు శాఖల అధికారులు, ఆయా గ్రామాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:29:35+05:30 IST