‘హాత్‌సే హాత్‌ జోడో’తో ప్రజలకు విముక్తి కల్పిస్తాం

ABN , First Publish Date - 2023-02-06T23:49:15+05:30 IST

హాత్‌సే హాత్‌జోడో పాదయాత్రల ద్వారా బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలతో మోసపోతున్న ప్రజలకు విముక్తి కల్పిస్తామని టీపీసీసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వీర్లపల్లి శంకర్‌ అన్నారు.

‘హాత్‌సే హాత్‌ జోడో’తో ప్రజలకు విముక్తి కల్పిస్తాం
సిద్దాపూర్‌లో పాదయాత్ర ప్రారంభిస్తున్న వీర్లపల్లి శంకర్‌

కొత్తూర్‌/చేవెళ్ల/షాద్‌నగర్‌ రూరల్‌, ఫిబ్రవరి 6: హాత్‌సే హాత్‌జోడో పాదయాత్రల ద్వారా బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలతో మోసపోతున్న ప్రజలకు విముక్తి కల్పిస్తామని టీపీసీసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వీర్లపల్లి శంకర్‌ అన్నారు. మండలంలోని సిద్దాపూర్‌లో హాత్‌సే హాత్‌జోడో పాదయాత్రను శంకర్‌ ప్రారంభించారు. అనంతరం ఎస్‌బీపల్లి, కొడిచర్ల, పెంజర్ల గ్రామం వరకు నిర్వహించిన పాదయాత్రలో కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. దారిపొడవున పంటపొలాల్లో పనిచేస్తున్న రైతులతో పాటు ప్రజలను శంకర్‌ కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు సిద్దాపూర్‌లో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గొంగళ్ల హరినాథ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభను ఉద్ధేశించి శంకర్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు డాకీ, కొమ్ము కృష్ణ, దేపల్లి కుమారస్వామిగౌడ్‌, చంద్రపాల్‌రెడ్డి, ఎస్‌బీపల్లి సర్పంచ్‌ అంబటి ప్రభాకర్‌, నాయకులు యాదయ్యయాదవ్‌, బాబర్‌ఖాన్‌, రఘు, శేఖర్‌రెడ్డి, బాల్‌రాజ్‌గౌడ్‌, సత్తయ్య, చెన్నయ్య, తిరుపతిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, శంకరయ్యగౌడ్‌, దేవేందర్‌ ముదిరాజ్‌, కృష్ణారెడ్డి, జంగ నర్సింహ, రాజు పాల్గొన్నారు. కాగా, ములుగు జిల్లా సమ్మక్క సారలక్క వద్ద టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన హత్‌సే హత్‌ జోడో పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి చేవెళ్ల నుంచి పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టీపీసీసీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్‌ చిన్నారెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, టీపీసీసీ కార్యదర్శి జనార్దన్‌రెడ్డిలతో కలిసి టీపీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివా్‌సగౌడ్‌, పార్టీ వ్రేణులు పాదయాత్రలో పాల్గొన్నారు. అదేవిధంగా ఫరూఖ్‌నగర్‌ మండలం ఎలికట్ట శివారులోని భవానీ మాత ఆలయంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు కడెంపల్లి శ్రీనివా్‌సగౌడ్‌, దంగు శ్రీనివా్‌సయాదవ్‌ పూజలు చేశారు. అనంతరం కేశంపేట మండలానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎ్‌సయూఐ జాతీయ కోఆర్డినేటర్‌ దినేష్‌ సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:49:16+05:30 IST