గుర్తు తెలియని వృద్ధుడు మృతి

ABN , First Publish Date - 2023-02-06T23:56:20+05:30 IST

షాద్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని చింతగూడ శివారులో గుర్తుతెలియని వృద్దుడు మృతి చెందినట్లు సీఐ నవీన్‌కుమార్‌ తెలిపారు.

గుర్తు తెలియని వృద్ధుడు మృతి

షాద్‌నగర్‌రూరల్‌, ఫిబ్రవరి 6: షాద్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని చింతగూడ శివారులో గుర్తుతెలియని వృద్దుడు మృతి చెందినట్లు సీఐ నవీన్‌కుమార్‌ తెలిపారు. సుమారు 75సంవత్సరాల వయస్సు కలిగిన వృద్ధుడు ధోతి ధరించి ఉన్నాడని తెలిపారు. రైతుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు షాద్‌నగర్‌ పోలీసులకు 08548-252333కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Updated Date - 2023-02-06T23:56:21+05:30 IST