టిప్పర్‌ బోల్తా.. తప్పిన ముప్పు

ABN , First Publish Date - 2023-02-06T23:57:26+05:30 IST

మట్టిలోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటన కేశంపేట మండలం లేమామిడి గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

టిప్పర్‌ బోల్తా.. తప్పిన ముప్పు

కేశంపేట, ఫిబ్రవరి 6: మట్టిలోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటన కేశంపేట మండలం లేమామిడి గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఆమనగల్లు నుంచి షాద్‌నగర్‌ వైపు మట్టిలోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌ లేమామిడి గ్రామ సమీపంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. వాహనంలో డ్రైవర్‌, క్లీనర్‌ మాత్రమే ఉండగా వారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ ధనుంజయ్‌ ఈ సందర్భంగా తెలిపారు.

Updated Date - 2023-02-06T23:57:28+05:30 IST