సీసీఎల్‌ఏ కమిషనర్‌ను కలిసిన టీజీవోస్ నాయకులు
ABN, First Publish Date - 2023-08-10T00:16:41+05:30
రెవెన్యూ శాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ, సీసీఎల్‌ఏ కమిషనర్ సర్వే సెటిల్మెంట్ నవీన్‌మిట్టల్‌ను బుధవారం రాష్ట్ర టీజీవో్‌స(సర్వే అండ్ లాండ్ రికార్డ్స్) యూనియన్ అధ్యక్షుడు ఎస్.నరహరిరావు, జనరల్ సెక్రటరీ ఎం.రాంచందర్ కలిశారు.
మేడ్చల్ ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రెవెన్యూ శాఖ ప్రిన్స్‌పల్ సెక్రటరీ, సీసీఎల్‌ఏ కమిషనర్ సర్వే సెటిల్మెంట్ నవీన్‌మిట్టల్‌ను బుధవారం రాష్ట్ర టీజీవో్‌స(సర్వే అండ్ లాండ్ రికార్డ్స్) యూనియన్ అధ్యక్షుడు ఎస్.నరహరిరావు, జనరల్ సెక్రటరీ ఎం.రాంచందర్ కలిశారు. రాష్ట్రంలో వీఆర్‌ఏ పోస్టుల క్రమబద్ధీకరణలో భాగంగా 420మంది వీఆర్‌ఏలను ఉద్యోగులుగా, చైన్‌మెన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేయడంపై కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. నవీన్‌మిట్టల్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. సర్వే శాఖ సిబ్బంది బదిలీల విషయం, ఆర్గనైజేషనల్ విషయాలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు వారు తెలిపారు. సర్వే శిక్షణ అకాడమికీ 14మంది కిందిస్థాయి ఉద్యోగులను చైన్‌మెన్‌లను కూడా త్వరలోనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలియజేశారు. కమిషనర్‌ను కలిసిన వారిలో యూనియన్ అధ్యక్షుడు ఎస్.నరహరిరావు, జనరల్ సెక్రటరీ ఎం.రాంచందర్, కోశాధికారి వి.శ్రీరామ్, సభ్యులు కేశవులు, కొండలు ఉన్నారు.
Updated Date - 2023-08-10T00:16:41+05:30 IST