విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి

ABN , First Publish Date - 2023-02-07T00:10:25+05:30 IST

విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహర్‌రెడ్డి అన్నారు.

విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి

పరిగి, ఫిబ్రవరి 6: విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం పరిగిలోని బాలికల ఉన్నత పాఠశాల, జడ్పీహెచ్‌ఎస్‌ నెం.1, నెం.2, మాదారం, రాపోల్‌, చిట్యాల్‌ ఉన్నత పాఠశాలల్లో టెన్త్‌ విద్యార్థులకు బీఎంఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. బీసీసీబీ మాజీ చైర్మన్‌ కమతం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఎస్పీ బాబయ్య, ఎంఈవో హరిశ్చందర్‌, పరిగి మాజీ సర్పంచ్‌ దోమ రాంచంద్రయ్య, మాజీ వైస్‌ ఎంపీపీ డి.మాణిక్యం, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.అశోక్‌రెడ్డి, నార్మాక్స్‌ డైరెక్టర్‌ పి.నారాయణరెడ్డి, సర్పంచ్‌ ప్రవీణ్‌, మాజీ సర్పంచి వెంకటేశ్‌, హెచ్‌ఎంలు బుగ్గయ్య, లాల్య, వెంకట్‌, పీఆర్టీయూ జిల్లా కార్యదర్శి డి.అమర్‌నాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:10:26+05:30 IST