గ్రామాల అభివృద్ధికే ‘ప్రగతి నివేదన’

ABN , First Publish Date - 2023-01-25T00:19:34+05:30 IST

మారుమూల గ్రామాలను అభివృద్ధి చేసేందుకే తాను ప్రగతి నివేదన పాదయాత్ర చేపట్టినట్లు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువనాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి చెప్పారు.

గ్రామాల అభివృద్ధికే ‘ప్రగతి నివేదన’
తక్కళ్లపల్లి తండాలో యువకులకు క్రికెట్‌ కిట్‌ అందజేస్తున్న ప్రశాంత్‌కుమార్‌రెడ్డి

యాచారం, జనవరి 24: మారుమూల గ్రామాలను అభివృద్ధి చేసేందుకే తాను ప్రగతి నివేదన పాదయాత్ర చేపట్టినట్లు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువనాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. మంగళవారం మూడో రోజు ప్రగతి నివేదన పాదయాత్ర తక్కళ్లపల్లి తండా, ఎర్రగొల్లతండా, తక్కళ్లపల్లి గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి ఆయా గ్రామాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తండాల్లో సీసీరోడ్లతో పాటు భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు రూ.10లక్షలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎర్రగొల్లతండాకు బస్సు సౌకర్యం కల్పించాలని తండావాసులు కోరగా వెంటనే ఇబ్రహీంపట్నం డిపో అధికారులతో మాట్లాడారు. సర్వేచేసి త్వరగా బస్సు నడపాలని డిపో అధికారులను కోరగా వారు సానుకూలంగా స్పందించారు. తండాల్లో వీధిదీపాలకు నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. మల్కీజ్‌గూడ నుంచి డొంకదారి ఉండడంతో ప్రధాన రహదారిగా మారిస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చించారు. బాలికా దినోత్సవం సందర్భంగా తక్కళ్లపల్లి అంగన్‌వాడీ భవనంలో బాలికలకు మిఠాయిలు పంచారు. కొత్త భవనం కావాలా అని అంగన్‌వాడీ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. గత అక్టోబర్‌లో మండలంలోని తాడిపర్తికి చెందిన చెందిన నలుగురు విద్యార్థులు ఎండీ రహేన్‌(10), ఎస్‌ఆర్‌ ఇమ్రాన్‌ (9), ఎండీ ఖాలేద్‌(12) ఇతని సోదరి సమ్రీన్‌(14) ఈతకు వెళ్లి మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే బాధిత కుటుంబాలను ప్రశాంత్‌రెడ్డి పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.25వేల చొప్పున మొత్తం రూ.లక్ష అందజేశారు. అదేవిధంగా మేడిపల్లి, తక్కళ్లపల్లి తండాల్లో యువకులకు రూ.50వేల విలువైన క్రికెట్‌కిట్లను అందజేశారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షకార్యదర్శులు కె.రమే్‌షగౌడ్‌ పి.బాషా, సర్పంచులు జగదీష్‌, సంతోష పాల్గొన్నారు. కాగా, ప్రశాంత్‌రెడ్డి పాదయాత్రకు డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య సంఘీభావం తెలిపారు.

Updated Date - 2023-01-25T00:20:05+05:30 IST