ప్రజా సంక్షేమానికి పెద్దపీట : మంచిరెడ్డి

ABN , First Publish Date - 2023-01-26T00:11:51+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు.

ప్రజా సంక్షేమానికి పెద్దపీట : మంచిరెడ్డి
పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి

మంచాల, జనవరి 25: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. మంచాల మండలం ఆగాపల్లి, కాగజ్‌ఘట్‌, జాపాల, అస్మత్‌పూర్‌ గ్రామాల్లో రూ.4.07కోట్లతో చేపట్టే గ్రామపంచాయతీ భవనాలు, బీటీ, సీసీ రోడ్ల నిర్మాణాలకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేస్తామన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకొని లబ్ధిపొందాలని సూచించారు. ఎంపీపీ నర్మదలచ్చీరాం, జడ్పీటీసీ మర్రి నిత్యనిరంజన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చంద్రయ్య, ప్యాక్స్‌ చైర్మన్‌ బుస్సు పుల్లారెడ్డి, ఎంపీటీసీలు ఎల్‌.చంద్రశేఖర్‌రెడ్డి, పి.సుకన్య, ఎన్‌.అనిత, సర్పంచ్‌లు పి.అండాలు, నౌహీద్‌బేగం, ఎన్‌.హరిప్రసాద్‌, జంగయ్య, ఎంపీడీవో శ్రీనివాస్‌, డీఈ అబ్బాస్‌, ఉపసర్పంచ్‌ మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:12:02+05:30 IST