పేదలకు న్యాయసేవలు అందించేందుకే లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం

ABN , First Publish Date - 2023-02-07T00:16:30+05:30 IST

న్యాయవాదిని నియమించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేదలకు న్యాయ సేవలందించేందుకే లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టమ్‌ను అమల్లోకి తెచ్చామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ అన్నారు.

 పేదలకు న్యాయసేవలు అందించేందుకే లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టం

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌

వర్చువల్‌గా లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టంను ప్రారంభించిన జడ్జి

హాజరైన జిల్లా కోర్టు జడ్జి సుదర్శన్‌, సీనియర్‌, జూనియర్‌ జడ్జిలు

వికారాబాద్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి ప్రతినిధి):న్యాయవాదిని నియమించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేదలకు న్యాయ సేవలందించేందుకే లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టమ్‌ను అమల్లోకి తెచ్చామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ అన్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సిస్టమ్‌ కార్యాలయాలను రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ నవీన్‌రావు, హైకోర్టు సీజే వర్చువల్‌గా ప్రారంభించారు. జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన ఆ కార్యాలయాన్ని జిల్లా జడ్జి సుదర్శన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి శీతల్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీకాంత్‌ ప్రారంభించారు. అనంతరం చీఫ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌గా టి.వెంకటేష్‌, డిప్యూటీ డిఫెన్స్‌ కౌన్సిల్‌గా పి.రాము బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. నేరారోపణలు ఎదుర్కొనే పేదలకు న్యాయసేవలందించేందుకు లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌లను నియమిస్తామన్నారు. వారి కేసులను చీఫ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌, డిప్యూటీ డిఫెన్స్‌ కౌన్సిల్‌ వాదిస్తారని చెప్పారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి జగన్‌, పీపీలు అశోక్‌కుమార్‌, నారాయణగౌడ్‌, రాజేశ్వర్‌, అన్వేష్‌సింగ్‌, సమీనాబేగం, రమేష్‌గౌడ్‌, న్యాయవాదులు గోవర్ధన్‌రెడ్డి, లవకుమార్‌, యాదవరెడ్డి, బస్వరాజ్‌, గోపాల్‌రెడ్డి, నాగరాజు, బాలయ్య, జనార్ధన్‌రెడ్డి, రమేష్‌కుమార్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:16:30+05:30 IST