Share News

భక్తి శ్రద్ధలతో కార్తీక పూజలు

ABN , First Publish Date - 2023-11-20T23:26:18+05:30 IST

కార్తీక మాస మొదటి సోమవారం సందర్భంగా మండలంలోని ఆలయాలు కిటకిటలాడాయి. భక్తులు ఉదయాన్నే స్నానం ఆచరించి శివాలయాలకు చేరుకొని లింగాలకు అభిషేకాలు నిర్వహించారు.

భక్తి శ్రద్ధలతో కార్తీక పూజలు
చందిప్ప మరకత శివలింగానికి పూజలు నిర్వహిస్తున్న భక్తులు

శంకర్‌పల్లి నవంబరు 20: కార్తీక మాస మొదటి సోమవారం సందర్భంగా మండలంలోని ఆలయాలు కిటకిటలాడాయి. భక్తులు ఉదయాన్నే స్నానం ఆచరించి శివాలయాలకు చేరుకొని లింగాలకు అభిషేకాలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. చందిప్ప మరకత శివాలయంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిది తొండ రవి కుటుంబ సమేతంగా స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ సదానందం, శ్రీనివాస్‌, శ్రీనివా్‌సరెడ్డి, ప్రవీణ్‌, మహేష్‌, శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2023-11-20T23:26:19+05:30 IST