పద్మశాలి సంఘం భవనం ప్రారంభం
ABN , First Publish Date - 2023-09-01T00:24:48+05:30 IST
షాద్‌నగర్ పట్టణంలో పద్మశాలి సంఘం నిర్మించిన శివభక్త మార్కెండేయ కల్యాణ మండపం భవనం ప్రారంభమైంది.
షాద్‌నగర్ అర్బన్, ఆగస్టు 31: షాద్‌నగర్ పట్టణంలో పద్మశాలి సంఘం నిర్మించిన శివభక్త మార్కెండేయ కల్యాణ మండపం భవనం ప్రారంభమైంది. రాఖీ పౌర్ణమిని పురష్కరించుకుని గురువారం సామూహిక యజ్ఞాలు, వ్రతాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, బీజేపీ నాయకులు ఏపీ మిథున్‌రెడ్డి, పి.వెంకటేశ్వర్‌రెడ్డిలు హాజరై పద్మశాలి సంఘం నాయకులను అభినందించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు కోట జనార్ధన్, ఒగ్గు కిషోర్, దాస కృష్ణయ్య, పి. నర్సింహులు, బి. చిన్నయ్య, బి. అంజనేయులు, చెరుకు రాములు తదితరులు పాల్గొన్నారు.