మద్యం తాగొద్దన్నందుకు భర్త ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-01-26T00:30:05+05:30 IST
మద్యం తాగొద్దని భార్య చెప్పగా భర్త పురుగుల మం దుతాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తంగడ్పల్లిలో బుధవారం చోటు చేసుకుంది.

చేవెళ్ల, జనవరి 25: మద్యం తాగొద్దని భార్య చెప్పగా భర్త పురుగుల మం దుతాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తంగడ్పల్లిలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగడ్పల్లికి చెందిన కుర్వ రమేశ్(32) వ్యవసాయ కూలీగా పని చేసేవా డు. కొంత కాలంగా అతడు మద్యానికి బానిసై భార్య అనంతమ్మతో గొడవపడుతున్నాడు. నిత్యం మందు ఎందుకు తాగుతున్నామని భార్య ప్రశ్నించడంతో ఆమెతో గొడవపడి ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ బుధవారం రమేశ్ మృతిచెందాడు. అతడికి భార్య, కొడుకు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అయ్యూబ్ తెలిపారు.