విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు

ABN , First Publish Date - 2023-02-01T23:24:05+05:30 IST

విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.

విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
పాఠశాలను ప్రారంభించి విద్యార్ధులతో కలిసి నినాదాలు చేస్తున్న మంత్రి మల్లారెడ్డి

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

ఘట్‌కేసర్‌, ఫిబ్రవరి 1: విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం మనబస్తీ - మనబడిలో భాగంగా రూ.20.87లక్షలతో ఆధునికీకరించిన పోచారం మున్సిపాలిటీ పరిధిలోని పోచారం ప్రాథమిక పాఠశాలను అధనపు కలెక్టర్‌ అభిషేక్‌ అగస్త్యతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 170 పాఠశాలలను ఆధునికీకరించి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మేడ్చల్‌ జిల్లాలో రూ. 76కోట్లు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ మౌలిక వసతలు కల్పిస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోలేదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధ్దికి రూ.7,300 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే 1100గురుకుల పాఠశాలలను ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యావైద్యంతో పాటు హరితతెలంగాణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రాంఽథాలయ చైర్మన్‌ దర్గా దయాకర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నానావత్‌ రెడ్డియానాయక్‌, కమిషనర్‌ సురేష్‌, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు నాయకులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:24:06+05:30 IST