బాలికలు అన్నిరంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2023-01-25T00:18:07+05:30 IST

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని పరిగి ఎంఈవో హరిశ్చందర్‌ అన్నారు. మంగళవారం జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని పరిగిలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

బాలికలు అన్నిరంగాల్లో రాణించాలి
పరిగి : సమావేశంలో మాట్లాడుతున్న ఎంఈవో హరిశ్చందర్‌

పరిగి/కులకచర్ల/నవాబుపేట/ఘట్‌కేసర్‌ రూరల్‌, జనవరి 24: బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని పరిగి ఎంఈవో హరిశ్చందర్‌ అన్నారు. మంగళవారం జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని పరిగిలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాలికలు తలుచుకుంటే ఎదైనా సాధించి తీరుతారని, ఆపద సమయంలో ధైౖర్యసాహసాలు ప్రదర్శించి ముందుకు సాగాలన్నారు. బాల్యవివాహాలు, బాల కార్మికులు, వరకట్నం, ఇతర తదితర అంశాలపై వక్తలు, చిన్నారులు ఉపన్యాసం ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం బి.కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు, బాలికలు పాల్గొన్నారు. అదేవిధంగా బాల్య వివాహాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత అని తహసీల్దార్‌ రమేశ్‌ తెలిపారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పలు అంశాలపై బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో పురోగతి సాధించాలని తెలిపారు. యువకులతో పాటు బాలికలు అన్నిరంగాల్లో పోటీ పడాలన్నారు. చిన్నతనంలో పెళ్లిళ్లు చేయడం వల్ల అనార్ధాలు కలుగుతాయని, యుక్తవయస్సు వచ్చిన తరువాతే బాలికలకు పెళ్లిళ్లు చేయాలన్నారు. చదువులో ఎల్లప్పుడూ ముందుండాలని సూచించారు. హెచ్‌ఎం నాగవరలక్ష్మి, పీఎన్‌పీఎ్‌స వ్యవస్థాపక అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు. నవాబుపేట మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకున్నారు. బాలిక సాధికారత, సమాజంలో ్డసమస్యలు, వివక్షతను ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశాలపై వక్తలు వివరించారు. ఎంఈవో గోపాల్‌, ప్రధానోపాధ్యాయుడు పాండు, ఎస్సై భరత్‌రెడ్డి, సర్పంచ్‌ విజయలక్ష్మి, వైద్యురాలు సునీత, స్వాతి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. కాగా, బాలికలు దేశానికే గర్వకారణమని ఘట్‌కేసర్‌ మండల విద్యాధికారి శశిధర్‌ అన్నారు. ఎదులాబాద్‌ జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవంను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎంఈవో ముఖ్యఅథితిగా పాల్గొని జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలను పుట్టనిద్దామని, బతకనివ్వాలని, చదువనివ్వాలని తెలిపారు. ఆడపిల్లలు దేశానికే గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సరస్వతి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:18:19+05:30 IST