పనుల్లో నాణ్యత తగ్గొద్దు

ABN , First Publish Date - 2023-02-01T23:36:53+05:30 IST

గ్రామాల్లో ఎక్కడా తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా మిషన్‌ భగీరథ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి ఆదేశించారు.

పనుల్లో నాణ్యత తగ్గొద్దు
స్థాయి సంఘం సమావేశంలో సమీక్ష నిర్వహిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి

తాగునీటి సమస్య ఎక్కడా ఉత్పన్నం కావొద్దు

జడ్పీ అతిథి గృహాల నిర్మాణాలు పూర్తి చేయాలి

వంద శాతం పన్నులు వసూలు చేయాలి

స్థాయి సంఘాల సమావేశాల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి

వికారాబాద్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : గ్రామాల్లో ఎక్కడా తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా మిషన్‌ భగీరథ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్తు కార్యాలయంలో జరిగిన స్టాండింగ్‌ కమిటీల సమావేశాల్లో వివిధ శాఖల పనితీరుపై ఆమె సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఎక్కడ తాగునీటి సమస్య ఎదురైనా వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. మండలాల్లో జడ్పీ అతిథి గృహాల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, పూర్తయిన చోట ఎంబీ రికార్డు చేయాలని ఆమె ఆదేశించారు. డ్వాక్రా మహిళలు రుణాలను వృఽథా ఖర్చు చేయకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించాలని ఆమె సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తట్టేపల్లి రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఇప్పటికీ కొందరుబహిరంగంగా మలవిసర్జన చేస్తూ పరిసరాలను అపరిశుభ్రంగా చేస్తున్నారని, నిర్మించుకున్న వ్యక్తిగత మరుగుదొడ్లను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించకుంటే సంబంధిత ఇంజనీర్లదే బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. బాధ్యతగా పనిచేయాలని సూచించారు. పంచాయతీల్లో వంద శాతం పన్నులు వసూలు చేయాలని, ఆ దిశగా ప్రజలు సహకరించి తమ గ్రామాల అభివృద్ధికి దోహదపడాలని ఆమె కోరారు. అంతకు ముందు వ్యవసాయ శాఖపై జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయకుమార్‌ అధ్యక్షతన సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు రావాలని, రైతులు కొత్త సాంకేతికతను ఉపయోగించుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. మహిళా శిశు, సాంఘిక సంక్షేమంపై స్థాయి సంఘాల చైర్‌పర్సన్లు సుజాత, చౌహాన్‌ అరుణదేషు అధ్యక్షతన సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ విజయకుమార్‌, సీఈవో జానకిరెడ్డి, డిప్యూటీ సీఈవో సుభాషిణి, డీఆర్‌డీవో కృష్ణన్‌, డీపీవో తరుణ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో జీవరాజ్‌, డీవైఎ్‌సవో హన్మంతరావు, డీసీఎ్‌సవో రాజేశ్వర్‌, సివిల్‌ సప్లయిస్‌ డీఎం విమల, సంఘాల సభ్యులు, వివిధ శాఖల అఽధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:36:55+05:30 IST