ఆడపిల్లలపై వివక్ష తగదు

ABN , First Publish Date - 2023-01-25T00:27:38+05:30 IST

డపిల్లలపై వివక్షత తగదని జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఆడపిల్లలపై వివక్ష తగదు
మాట్లాడుతున్న కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

రంగారెడ్డి అర్బన్‌, జనవరి 24 : ఆడపిల్లలపై వివక్షత తగదని జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌, అధికారులతో కలిసి బాలికలు కేక్‌ కట్‌ చేశారు. అంతకు ముందు విద్యార్థినులు, యువతులు వారి అనుభవాల గురించి తెలిపారు. అంతకుముందు బేటీ బచావో-బేటీ పడావో క్యాలెండర్‌ను విడుదల చేశారు. వివిధ అంశాలలో, జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభను చాటిన విద్యార్థులకు నగదు బహుమతి, ప్రశంసా పత్రాలను అందజేశారు. బాలికలు సమాజానికి మణిహారమని, బాలికలకు రక్షణ కల్పిద్దాం.. వారి బంగారు భవితకు పునాది వేద్దామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆడ, మగ అనే తేడాలు పిలిచే పిలుపులో ఉండాలి తప్ప చూపించే ప్రేమలో ఉండకూడదన్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆడపిల్లలు వివక్షతకు గురవుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వివక్ష ఎక్కువగా ఉందన్నారు. ఈ జాడ్యాన్ని రూపు మాపాలంటే ముందు కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలని తెలిపారు. అమ్మాయిలు ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలని సూచించారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాన కల్పించాలని, ప్రతి అంశంపై చర్చించే విధంగా శిక్షణ ఇవ్వాలని డీఈవోకు సూచించారు. జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సెక్రటరీ శ్రీదేవి మాట్లాడుతూ తల్లిదండ్రులు, టీచర్లు స్నేహ భావంతో ఉన్నప్పుడు సమాజంలో ఆమ్మాయిలు ఎదు ర్కొంటున్న సమస్యలను వారితో దైర్యంగా చెప్పుకోగలుతా రని అన్నారు. అధికారులు, ఎన్జీవోలు కింది స్థాయిలో విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని, అమ్మాయి లను గర్బస్థ శిశువు నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, మహిళా శిశు సంక్షేమ స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ విశాల, సీడబ్ల్యుసీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, అంజన్‌రావు, జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు, జిల్లా శిశు సంక్షేమాధికారి మోతి, సూపర్‌వైజర్లు, చైల్డ్‌లైన్‌ కోఆర్డినే టర్లు, వివిధ బాలల సంరక్షణ కేంద్రాల నిర్వాహకులు, వివిధ ఎన్జీవోల అధికారులు పాల్గొన్నారు. అనంతరం యాచారం మండలంలోని చింతపట్ల ఉన్నత పాఠశాల విద్యార్థిని శివానికి ప్రశంసాపత్రంతో పాటు రూ. 3వేల నగదు అందించారు. బాలిక రాష్ట్ర స్థాయి ఖోఖోలో ప్రతిభను చాటడం అభినందనీయమని యాచారం ఎంఈవో వెంకటరెడ్డి. హెచ్‌ఎం సురేష్‌ కొనియాడారు.

Updated Date - 2023-01-25T00:27:39+05:30 IST