తోటి కూలీని కిడ్నాప్‌ చేశారంటూ ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-01-26T00:02:49+05:30 IST

కాటన్‌ మిల్లులో పనిచేస్తున్న కూలీని కిడ్నాప్‌ చేశారంటూ తోటి కూలీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే... ఆదిలాబాద్‌ జిల్లా భగత్‌సింగ్‌ నగర్‌కు చెందిన సంతోష్‌ అనే వ్యక్తిని మంగళవారం సాయంత్రం పరిగి మండలం రంగంపల్లిలో గల నర్సింహ కాటన్‌మిల్లు సిబ్బంది లక్ష్మణ్‌తో పాటు మరో వ్యక్తి మండల పరిధిలోని అంగడిచిట్టెంపల్లి గేటు సమీపంలో గల ధరణి కాటన్‌ మిల్లులో పనిచేస్తున్న సంతోష్‌ను బలవంతంగా కారులో తీసుకెళ్లారు.

తోటి కూలీని కిడ్నాప్‌ చేశారంటూ ఫిర్యాదు

పూడూరు, జనవరి 25 : కాటన్‌ మిల్లులో పనిచేస్తున్న కూలీని కిడ్నాప్‌ చేశారంటూ తోటి కూలీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే... ఆదిలాబాద్‌ జిల్లా భగత్‌సింగ్‌ నగర్‌కు చెందిన సంతోష్‌ అనే వ్యక్తిని మంగళవారం సాయంత్రం పరిగి మండలం రంగంపల్లిలో గల నర్సింహ కాటన్‌మిల్లు సిబ్బంది లక్ష్మణ్‌తో పాటు మరో వ్యక్తి మండల పరిధిలోని అంగడిచిట్టెంపల్లి గేటు సమీపంలో గల ధరణి కాటన్‌ మిల్లులో పనిచేస్తున్న సంతోష్‌ను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. దీంతో తోటి కూలీలు బుధవారం చన్‌గోముల్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈమేరకు సంతో్‌షను పరిగి పోలీ్‌సస్టేషన్‌కు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈవిషయమై చన్‌గోముల్‌ ఎస్సై విఠల్‌రెడ్డిని అడగగా.. సంతోష్‌ అనే వ్యక్తి లేబర్‌ కాంట్రాక్టర్‌గా ధరణి, నర్సింహ కాటన్‌ మిల్లుల్లో విధులు నిర్వహిస్తున్నాడని, ఈక్రమంలో నర్సింహ కాటన్‌ మిల్లు యాజమాన్యం వద్ద కొంత డబ్బు ఇచ్చి లేబర్‌ను పంపించాలని సంతోష్‌ కోరినట్లు తెలిపారు. అయితే, డబ్బులు తీసుకొని పని చేసి పెట్టకపోవడంతో అతడిని కారులో తీసుకెళ్లినట్లు విచారణలో తెలిసిందని పోలీసులు తెలిపారు. కాగా, సంతోష్‌ తోటి కూలీలైన.. జగదీప్‌, పంజాబ్‌ రాథోడ్‌లు మాత్రం.. సంతో్‌షకు గతంలో అడ్వాన్స్‌గా డబ్బులు ఇవ్వడంతో లేబర్‌ను పంపించాడని, మూడు నెలలపాటు నర్సింహ కాటన్‌ మిల్లులో ఉన్నారని, తర్వాత అక్కడ పని లేకపోవడంతో వెళ్లిపోయినట్లు తెలిపారు. ఇప్పుడు పత్తి మిల్లుకు తీసుకొచ్చే సీజన్‌ కావడంతో సంతో్‌షను బలవంతంగా కారులో తీసుకెళ్లారని, రాత్రి అతడిపై దాడి చేసినట్లు సంతోష్‌ ఫోన్‌ ద్వారా తెలిపారని తోటి కూలీలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-01-26T00:02:49+05:30 IST