కమిషనర్‌ ఆదేశాలు బేఖాతర్‌!

ABN , First Publish Date - 2023-02-07T00:12:13+05:30 IST

వికారాబాద్‌ మునిసిపల్‌ పాలన అస్తవ్యస్తంగా మారిందనడానికి నిలువెత్తు నిదర్శనం.. అధికారులు, సిబ్బంది పాటించే సమయ పాలన అని చెప్పొచ్చు.

కమిషనర్‌ ఆదేశాలు బేఖాతర్‌!
ఉదయం 10 గంటలు దాటినా రెవెన్యూ విభాగంలో ఖాళీగా ఉన్న కుర్చీలు

సమయానికి రావాలని సర్క్యులర్‌ జారీ చేసినా..

ఆలస్యంగా వచ్చిన మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది

వికారాబాద్‌, ఫిబ్రవరి 6 : వికారాబాద్‌ మునిసిపల్‌ పాలన అస్తవ్యస్తంగా మారిందనడానికి నిలువెత్తు నిదర్శనం.. అధికారులు, సిబ్బంది పాటించే సమయ పాలన అని చెప్పొచ్చు. మునిసిపాలిటీలో అధికారులు ఎప్పుడు వస్తారో? ఎప్పుడు పోతారో.. ఎవరికీ తెలియదు. ఈ విషయం గ్రహించివన మునిసిపల్‌ కమిషనర్‌ శనివారం అధికారులు, సిబ్బందికి సర్క్యూలర్‌ జారీ చేసి సమయ పాలన విధి విధానాలను వివరించినప్పటికీ బేఖాతార్‌ చేశారు. రెవెన్యూ విభాగంలో బిల్‌ కలెక్టర్‌ ఉదయం 7 గంటలకు రిపోర్ట్‌ చేయాల్సి ఉండగా, కార్యాలయ అధికారులు సిబ్బంది ఉదయం 9 గంటలకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. అందులో కంప్యూటర్‌ ఆపరేటర్లు మిగితా అధికారులు ఉండగా సోమవారం ఉదయం 10.10 అయినప్పటికీ టౌన్‌ఫ్లానింగ్‌ అధికారి, మరో కిందిస్థాయి సిబ్బంది తప్పా.. ఎవరూ రాకపోవడం విశేషం. కమిషనర్‌ రెండు రోజులు సెలవుల్లో ఉండడంతో.. మమ్మల్ని ఎవరు అడుగుతారులే! అనే ధీమాతో ఉన్నారేమో కానీ, సమయపాలన మాత్రం అస్సలు పాటించడం లేదు. ఇంజనీరింగ్‌ విభాగంలో సైతం అధికారులు సమయ పాలన పాటించడం లేదు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రెండున్నర సంవత్సరాల ఒప్పందం గొడవ ప్రారంభమైనప్పటి నుంచి ఎవరికి వారే.. యమునా తీరే అన్న చందంగా మారింది.

Updated Date - 2023-02-07T00:12:14+05:30 IST