కారు-ట్రాక్టర్‌ ఢీ.. ఒకరికి గాయాలు

ABN , First Publish Date - 2023-02-02T00:08:30+05:30 IST

మాడ్గుల నుంచి ఆమనగల్లుకు వెళ్లే రోడ్డులో పకీర్‌తండా గేటు సమీపంలో బుధవారం కారు-ట్రాక్టర్‌ ఢీకొన్న ప్రమా దంలో కారులోని వ్యక్తికి గాయాలయ్యాయి.

కారు-ట్రాక్టర్‌ ఢీ.. ఒకరికి గాయాలు

మాడ్గుల, ఫిబ్రవరి 1: మాడ్గుల నుంచి ఆమనగల్లుకు వెళ్లే రోడ్డులో పకీర్‌తండా గేటు సమీపంలో బుధవారం కారు-ట్రాక్టర్‌ ఢీకొన్న ప్రమా దంలో కారులోని వ్యక్తికి గాయాలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులో ఓ విలేకరి, అతడి కొడుకు హైదరాబద్‌ నుంచి అవురుపల్లికి వస్తున్న సమయంలో మట్టి ట్రాక్టర్‌ రాంగ్‌రూటులో వచ్చి ఢీకొంది. దీంతో కారులోని వ్యక్తికి సల్ప గాయమైనట్టు తెలిపారు. అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు.

Updated Date - 2023-02-02T00:08:32+05:30 IST