Share News

బీఆర్‌ఎస్‌ను ఆదరించి గెలిపించాలి

ABN , First Publish Date - 2023-11-22T00:05:04+05:30 IST

తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా ప్రగతిని కాంక్షించి బీఆర్‌ఎస్‌ను ఆదరించి గెలిపించాలని కల్వకుర్తి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ కోరారు.

బీఆర్‌ఎస్‌ను ఆదరించి గెలిపించాలి
ఆమనగల్లు : సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌

కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌

ఆమనగల్లు, నవంబరు 21 : తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా ప్రగతిని కాంక్షించి బీఆర్‌ఎస్‌ను ఆదరించి గెలిపించాలని కల్వకుర్తి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ కోరారు. 55 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో స్కాములే తప్ప స్కీములు లేవని, ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్న తెలంగాణను చూసి మళ్లీ ఆగం చేయడానికి ఆ పార్టీ సాగిస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి, మాడ్గుల, కల్వకుర్తి, వెల్దండ మండలాల్లో మంగళవారం జైపాల్‌ యాదవ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెల్దండ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మండలంలోని వివిద గ్రామాలు, తండాల నుంచి ప్రజలు వేలాదిగా తరలి వచ్చారు. ఆశీర్వాద సభలో జైపాల్‌ యాదవ్‌, రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ ఉప్పల వెంకటేశ్‌, కల్వకుర్తి మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం, మండల నాయకులు పాల్గొని ప్రసంగించారు. మాడ్గుల మండలం అవురుపల్లి ఎంపీటీసీ పోలె కృష్ణమ్మతో పాటు పెద్దఎత్తున కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సీనియర్‌ నాయకుడు లాలయ్యగౌడ్‌ ఆధ్వర్యంలో జైపాల్‌ యాదవ్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. పలు గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీలు నిర్వహించారు. ఆయా చోట్ల జరిగిన కార్యక్రమాలలో మాజీ ఎంపీపీ పుట్ట రాంరెడ్డి, తలకొండపల్లి ఎంపీపీ నిర్మలశ్రీశైలం గౌడ్‌, నాయకులు చంద్రమోహన్‌ రెడ్డి, తదితరులున్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ 9వ వార్డులో కౌన్సిలర్‌ సోనజయరామ్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా సీనియర్‌ నాయకుడు గుత్తి బాలస్వామి ఆధ్వర్యంలో జైపాల్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గుత్తి శేఖర్‌, గోపాల్‌ రావు, తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లు మండలంలోని పలు గ్రామాల్లో జడ్పీటీసీ అనురాధపత్యనాయక్‌, వైస్‌ ఎంపీపీ అనంత రెడ్డి, మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ గిరియాదవ్‌, మండలాధ్యక్షుడు అర్జున్‌రావు, నిట్ట నారాయణ, సోన శ్రీనునాయక్‌, సరితపంతూనాయక్‌, మల్లమ్మయాదయ్య, సయ్యద్‌ ఖలీల్‌, గండికోట శంకర్‌, నిరంజన్‌గౌడ్‌, రమేశ్‌, వెంకటేశ్‌, భాస్కర్‌, సతీష్‌, కిరణ్‌, ప్రసాద్‌ లు జైపాల్‌ యాదవ్‌ ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం, ర్యాలీలు నిర్వహించారు. కడ్తాల మండల కేంద్రంలో సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి ప్రచారం చేపట్టారు. గణేశ్‌గౌడ్‌, రాంచంద్ర య్య, నర్సింహ్మ, ఈర్ష్యద్‌, వెంకటయ్య, తదితరులున్నారు. కడ్తాల మండలం ముద్విన్‌లో జడ్పీటీసీ దశరథ్‌ నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌, మండలాధ్యక్షుడు పరమేశ్‌, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ గోపాల్‌, సర్పంచ్‌ లు యాదయ్య, జీఎల్‌ఎన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ వినోద్‌, పీఏసీఎ్‌స్‌ డైరెక్టర్‌ వెంకటయ్యలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గంప శ్రీను, గోపాల్‌, హర్యనాయక్‌, రాజు, తదితరులు పాల్గొన్నారు.తలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ జిల్లా సీనియర్‌ నాయకుడు సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పద్మ నర్సింహ్మ, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు ముజుబుర్‌ రహెమాన్‌లు ప్రచారం చేశారు. జైపాల్‌ను గెలిపించాలని ఆయన కుమార్తెలు, కోడలు సంగీత, వాణి, జ్యోతిలు ముద్విన్‌, కడ్తాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Updated Date - 2023-11-22T00:05:05+05:30 IST