Share News

ఆశీర్వదించండి.. భారీ మెజార్టీతో గెలిపించండి

ABN , First Publish Date - 2023-11-22T00:08:37+05:30 IST

సేవకుడే నాయకుడని.. ప్రజలు ఆశీర్వదించి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని మహేశ్వరం కాంగ్రెస్‌ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.

ఆశీర్వదించండి.. భారీ మెజార్టీతో గెలిపించండి
కందుకూరు : మాదాపురంలో మాట్లాడుతున్న కేఎల్లార్‌

మహేశ్వరం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

కందుకూరు, నవంబరు 21 : సేవకుడే నాయకుడని.. ప్రజలు ఆశీర్వదించి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని మహేశ్వరం కాంగ్రెస్‌ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ఆపార్టీ మండల శాఖ అధ్యక్షుడు కృష్ణానాయక్‌ ఆధ్వర్యంలో మాదాపురం, కొలన్‌గూడ, గుమ్మడవెళ్లి, తు ర్కగూడ, కటికపల్లి, గూడూరు. అన్నోజిగూడ, ఎన్‌టీఆర్‌ తాండ, బేగరికంచ, సార్లరావులపల్లి, కందుకూరు చౌర్తలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పీసీసీ సభ్యులు ఏనుగు జంగారెడ్డి, సరికొండ మల్లే్‌షలతో కలిసి మాట్లాడారు. తాను సేవచేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని, మహేశ్వరం ప్రజలు ఒక్కసారి ఆశీర్వదించి గెలిపించాలని కేఎల్లార్‌ కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్‌ షాపు ద్వారా సబ్సిడీపై తొమ్మిది రకాల నిత్య వసర వస్తువులు, మండల కేంద్రాల్లో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నిర్మించనున్నట్లు గుర్తుచేశారు. విద్యార్థులు (బాలికలు) ఉన్నత విద్య కోసం 5 లక్షల గ్యారంటీ కార్డులను, ఇంటర్‌ రెండో సంవత్సరం పూర్తి చేసుకున్న బాలికలకు చార్జింగ్‌ స్కూటీని ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో ఇతర పార్టీల కార్యకర్తలు, జల్‌పల్లి మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్‌ జింకల రాధికశ్రావణ్‌ లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ ఎంపీపీ గంగుల శమంతప్రభాకర్‌రెడ్డిమండల పరిషత్తు కో-ఆప్షన్‌ మెంబరు ఎండి సులేమాన్‌, నాయకులు బొక్క భూపాల్‌రెడ్డి, ఎగ్గిడి కృష్ణ, ప్రబాకర్‌రెడ్డి, ఎగిరిశెట్టి నర్సింహ్మ, సరికొండ పాండు, ఎస్‌ జైపారెడ్డి, రంగారెడ్డి, పాండుకురుమ, జగదీశ్వర్‌, కె.మధన్‌పాల్‌రెడ్డి, పరమేష్‌, సురేందర్‌, సుధాకర్‌రెడ్డి, సరికొండ జగన్‌, కందుకూరు సర్పంచ్‌ శమంతకమణి, తదితరులు పాల్గొన్నారు.

నేనూ తుక్కుగూడ వాసినే : కేఎల్లార్‌

మహేశ్వరం : నేనుతుక్కుగూడ వాసినే.. నా ఇల్లు తుక్కుగూడలోనే ఉంది.. ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఆదుకుంటానని కాంగ్రెస్‌ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం రాత్రి తుక్కుగూడ మున్సిపాలిటీలోని మంఖాల్‌, రావిరాల, ఇమాంగూడ గ్రామాల్లో బడంగ్‌పేట మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్ధేశించి కేఎల్లార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని తెలిపారు. తొమ్మిదిన్నర సంవత్సరాలు బీజేపీ, బీఆర్‌ఎలు దేశాన్ని, రాష్ర్టాన్ని దోచుకుతిన్నారని విమర్శించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని మోదీ, కేసీఆర్‌లు మర్చిపోవద్దన్నారు. పెండ్యాల గ్రామంలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు మాజీ జడ్పీటీసీ జంగయ్య, హన్మంత్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ గౌస్‌ లతో పాటు తధాతర నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అద్యక్షుడు చల్లా నర్సింహ్మరెడ్డి, బడంగ్‌పేట మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహ్మరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు మాజీ ఎంపీపీ కె. రఘుమారెడ్డి, కాకిఈశ్వర్‌ ముదిరాజ్‌, అవుల యాదయ్య, ఎ. కృష్ణానాయక్‌, పాండునాయక్‌, దశరత్‌నాయక్‌, జానకీరామ్‌, రాఖేష్‌, రాజునాయక్‌, భాస్కర్‌, వెంకట్‌రెడ్డి, విష్టువర్ధన్‌రెడ్డి, జాన్‌, ప్రవీణ్‌, రమేష్‌, షఫీ, రాజెందర్‌ తధితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అధికారంలోకి రాగానే హార్డ్‌వేర్‌ పార్క్‌ జీవో రద్దు

సరూర్‌నగర్‌ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ కచ్చితంగా అధికారంలోకి రాబోతోందని, ఆ వెంటనే నాదర్‌గుల్‌, ఆదిభట్ల, ఎం.ఎం.కుంట గ్రామాలకు సంబంధించిన హార్డ్‌వేర్‌ పార్క్‌ జీవోను రద్దు చేయించడానికి కృషి చేస్తానని పీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్‌, బడంగ్‌పేట్‌ మేయర్‌ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి స్పష్టం చేశారు. మహేశ్వరం కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎల్లార్‌ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని ఆమె గుర్తు చేశారు. మంగళవారం నాదర్‌గుల్‌లోని బీఎంఆర్‌ గార్డెన్స్‌లో హార్డ్‌వేర్‌ పార్క్‌ బాధిత రైతులు, ప్లాట్ల యజమానుల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పారిజాతారెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో జేఏసీ ఛైర్మన్‌ మాధవరం రామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దార సత్యం, కన్వీనర్లు కందాడి శ్రీరాంరెడ్డి, మర్రి హన్మంత్‌రెడ్డి, నాయకులు పెత్తుల్ల ఆనంద్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రామారావు, రవికాంత్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కాలనీవాసుల మద్ధతు కోరిన సీఎన్‌ఆర్‌

మహేశ్వరంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఎల్లార్‌కు మద్ధతుగా నిలవాలని బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ మాజీ వైస్‌ చైౖర్మన్‌ చిగిరింత నర్సింహారెడ్డి గుర్రంగూడ 7వ డివిజన్‌లోని జీబీఆర్‌ కాలనీవాసులను కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన కాలనీని సందర్శించి సంక్షేమ సంఘం ప్రతినిధులతో, కాలనీవాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల తర్వాత కాలనీలోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని, కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎల్లార్‌కు ప్రతి ఒక్కరూ మద్ధతివ్వాలని కోరారు.

మీర్‌పేట్‌లో కేఎల్లార్‌ తనయుడి ప్రచారం

కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎల్లార్‌ తనయుడు అనూ్‌పరెడ్డి మంగళవారం మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లోని 10వ డివిజన్‌ పరిధిలోని పలు కాలనీల్లో పర్యటించి హస్తం గుర్తుకు ఓటేసి తమ తండ్రిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆరు గ్యారంటీలకు సంబంధించిన కరపత్రాలను పంచుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మీర్‌పేట్‌ శాఖ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, ఎన్‌ఎ్‌సయూఐ అధ్యక్షుడు దీక్షిత్‌ తదితరులున్నారు.

అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీల అమలు

ఎల్‌బీనగర్‌ : కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీ హామీలను అమలు చేస్తుందని మహేశ్వరం కాంగ్రెస్‌ అభ్యర్థి కెఎల్లార్‌ సతీమణి విజయలక్ష్మి చెప్పారు. సరూర్‌నగర్‌లో నిర్వహించిన ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్‌రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శంకర్‌యాదవ్‌, ఆకుల అరవింద్‌కుమార్‌, నల్లెంకి ధన్‌రాజ్‌గౌడ్‌, ఎస్సీసెల్‌ కన్వీనర్‌ బండి మధుసూదన్‌రావు, రవీంద్ర, పంతంగి రాముగౌడ్‌, గుల్షన్‌, ఇమ్రాన్‌అలీ, అక్బర్‌, కల్యాణ్‌, కిషోర్‌, రమేష్‌ తదితరులున్నారు.

కాంగ్రె్‌సలో చేరిన బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు

ఆర్‌కేపురం డివిజన్‌ పరిధిలోని ఎన్‌టీఆర్‌నగర్‌, సాయిబాబానగర్‌లకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్‌ నాయకులు చిలుక ఉపేందర్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు మహేష్‌, కోటేష్‌, లోకేష్‌, పవన్‌లతో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Updated Date - 2023-11-22T00:08:38+05:30 IST