Anushka అపాయింట్‌మెంట్ ఇప్పిస్తానని ప్రొడ్యూసర్‌కి గాలం..

ABN , First Publish Date - 2023-01-25T12:52:43+05:30 IST

స్టార్ హీరోయిన్ అనుష్క అపాయింట్‌మెంట్ ఇప్పిస్తామంటూ... వర్దమాన ప్రొడ్యూసర్ లక్ష్మణా చారికి ఓ కేటుగాడు గాలం వేశాడు.

Anushka అపాయింట్‌మెంట్ ఇప్పిస్తానని ప్రొడ్యూసర్‌కి గాలం..

హైదరాబాద్ : స్టార్ హీరోయిన్ అనుష్క అపాయింట్‌మెంట్ ఇప్పిస్తామంటూ... వర్దమాన ప్రొడ్యూసర్ లక్ష్మణా చారికి ఓ కేటుగాడు గాలం వేశాడు. విశ్వకర్మ క్రియేషన్స్ అధినేత, నిర్మాత లక్ష్మణా చారికి అనుష్క, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ డేట్స్ ఇప్పిస్తానని చెప్పి మేనేజర్ ఎల్లారెడ్డి రూ.51 లక్షలు వసూలు చేశాడు. అనుష్క, నిర్మాతను మోసం చేశాడు. బంజారాహిల్స్ పోలీసులను లక్ష్మణా చారి ఆశ్రయించాడు. నిర్మాతను పలు మార్లు బెంగళూర్ తీసుకెళ్ళిన ఎల్లారెడ్డి.. మోతి మహల్ హోటల్‌లో పలువురిని పరిచయం చేశాడు. చివరకు ఎల్లారెడ్డి చేతిలో మోసపోయానని గుర్తించిన లక్ష్మణాచారి నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. ఎల్లారెడ్డిని ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు దొరై మందలించినా ఫలితం లేకుండా పోయింది. ఎంతకీ డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులకు లక్ష్మణాచారి ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2023-01-25T12:52:43+05:30 IST