గంజాయి తరలిస్తున్న ఒకరి అరెస్టు
ABN , First Publish Date - 2023-01-24T00:08:58+05:30 IST
వేల్పూర్ క్రాస్‌రోడ్డు వద్ద గంజాయి తరలిస్తున్నా పెర్కిట్‌కు చెందిన మహమ్మద్ అజాద్అలీ అనే నిందితుడిని అరెస్టు చేసినట్టు ఆర్మూర్ రూరల్ సీఐ గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం వే ల్పూర్ పోలీసులు గంజాయికి సంబంధించిన వివరాలను విలేకరులకు వె ల్లడించారు. 63వ జాతీయ రహదారి మీదుగా గంజాయిని తరలిస్తున్నార నే సమాచారం మేరకు ఎస్సై వినయ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు ని ర్వహించగా, మహమ్మద్ అజాద్అలీ గంజాయి తరలిస్తుండగా పట్టుకు న్నామన్నారు.

వేల్పూర్, జనవరి23: వేల్పూర్ క్రాస్‌రోడ్డు వద్ద గంజాయి తరలిస్తున్నా పెర్కిట్‌కు చెందిన మహమ్మద్ అజాద్అలీ అనే నిందితుడిని అరెస్టు చేసినట్టు ఆర్మూర్ రూరల్ సీఐ గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం వే ల్పూర్ పోలీసులు గంజాయికి సంబంధించిన వివరాలను విలేకరులకు వె ల్లడించారు. 63వ జాతీయ రహదారి మీదుగా గంజాయిని తరలిస్తున్నార నే సమాచారం మేరకు ఎస్సై వినయ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు ని ర్వహించగా, మహమ్మద్ అజాద్అలీ గంజాయి తరలిస్తుండగా పట్టుకు న్నామన్నారు. నిందితుడు మద్యం, గంజాయి, గంజాయి తాగుతూ జల్సా లకు అలవాటుపడ్డాడన్నారు. అందుకు డబ్బులు సంపాదించాలన్న ఆలోచ నతో నాందేడ్‌లో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడికి తెచ్చుకొని ఎవరికి అనుమానం రాకుండా ఒక తెల్ల పాస్టిక్ కవర్ లోపల మరో నల్లటి ప్లస్టిక్ కవర్ ఉంచి అందులో ఎం డు గంజాయిని ఉంచుకొని చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లు ఉంచి కవర్లలో విక్రయించేవాడన్నారు. ప్యాకెట్‌కు రూ.500 చొప్పున అమ్మి డబ్బులు సం పాదించుకోవాలనే ఆశతో వేల్పూర్‌కు వస్తుండగా క్రాస్‌రోడ్డు వద్ద ఎండు గంజాయితో వ్యక్తిని పట్టుకున్నామన్నారు. నిందితుడి నుంచి 300 గ్రాము ల గంజాయి, సెల్‌ఫోన్, 15చిన్న కాలి ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకు న్నామన్నారు. గంజాయి నిందితుడిని పట్టుకోవడంలో శ్రమించిన ఎస్సై వినయ్, ఎఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్, సిబ్బంది సందీప్, భరత్‌గౌడ్, శ్రావణ్, నరేష్, శ్రీకాంత్, సాయన్నలను రూరల్ సీఐ గోవర్ధన్‌రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ గోవర్ధన్‌రెడ్డి, ఎస్సై వినయ్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.