రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2023-01-24T00:44:33+05:30 IST

ఈ నెల 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ‘ప్రజావాణి’ అనంతరం జిల్లా అధికారులతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు.

రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌అర్బన్‌, జనవరి 23: ఈ నెల 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ‘ప్రజావాణి’ అనంతరం జిల్లా అధికారులతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా శాఖల ప్రగతిని వివరించేలా షకటాల ప్రదర్శనతో పాటు స్టాల్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా కూడా జాతీయ జెండా గౌరవానికి బంగం వాటిళ్ల కుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అట్టహాసంగా రిపబ్లిక్‌ డే ఉత్సవాలు జరిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈశ్రమ్‌ పోర్టల్‌లో అసంఘటిత రంగ కార్మికుల పేర్లను నమోదు చేయించేందుకు ఆయాశాఖల అధికారులు కృషి చేయాలన్నారు. దీని వల్ల కార్మికులకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఉచితంగా 2లక్షల వరకు ప్రమాబ బీమా సదుపాయం వర్తిస్తుందని అర్హులైన అసంఘటిత రంగ కార్మికులందరిని ఈ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. సౌర విద్యుత్‌ యూనిట్ల కోసం శ్రీనిధి రుణాలు అందించే కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T00:44:33+05:30 IST