సివిల్‌ సప్లై అధికారులపై విజి‘లెన్స్‌’

ABN , First Publish Date - 2023-01-26T01:33:16+05:30 IST

యాసంగి ధాన్యం సేకరణ, నగదు చెల్లింపుల్లో అవకతవకలపై సివిల్‌ సప్లయిస్‌ జిల్లా మేనేజర్‌ నాగేశ్వరరావుపై చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు బుధవారం ప్రభుత్వ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి వి.అనిల్‌కుమార్‌ పేరిట ఉత్తర్వులు జారీ అ య్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

సివిల్‌ సప్లై అధికారులపై విజి‘లెన్స్‌’

ధాన్యం సేకరణ, చెల్లింపులపై విచారణ

నల్లగొండ జిల్లా మేనేజర్‌పై చర్యలకు సిఫారసు

నల్లగొండ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): యాసంగి ధాన్యం సేకరణ, నగదు చెల్లింపుల్లో అవకతవకలపై సివిల్‌ సప్లయిస్‌ జిల్లా మేనేజర్‌ నాగేశ్వరరావుపై చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు బుధవారం ప్రభుత్వ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి వి.అనిల్‌కుమార్‌ పేరిట ఉత్తర్వులు జారీ అ య్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం ఓగోడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రంలో 2020-21 యాసంగి సంవత్సరానికి 357 మంది రైతుల నుంచి సుమారు 27,029 క్వింటాళ్ల ధాన్యాన్ని (67,574 బస్తాలు) సేకరించారు. ధాన్యం కొనుగోలు చేసే సమయంలో 42కిలోల బస్తాను 40 కిలోలుగా చూపించారని, అంతేకాక ఒకరి ఖాతాకు బదులు మరొకరి ఖాతాలో డబ్బులు జమ చేశారని ఓగోడు గ్రామ రైతులు ఫిర్యాదు చేయటంతో గత నెలలో విజిలెన్స్‌ అధికారులు గ్రామంలో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సివిల్‌ సప్లయిస్‌ అధికారుల నిర్లక్ష్యంతో అటు రైతులకు, ఇటు ప్రభుత్వానికి నష్టం జరిగిందని పేర్కొన్నారు. విచారణలో భాగంగా 95 మంది రైతుల బ్యాంకు వివరాలను సేకరించారు. నివేదిక ఆధారంగా సివిల్‌ సప్లయిస్‌ నల్లగొండ జిల్లా మేనేజర్‌ నాగేశ్వరరావుకు మెమో జారీచేశారు. 10రోజుల్లో లిఖితపూర్వక సమాధానమివ్వాలని ఆదేశించారు.

Updated Date - 2023-01-26T01:33:17+05:30 IST