రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవు

ABN , First Publish Date - 2023-02-07T00:46:23+05:30 IST

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవని, షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సినిమాటోగ్రఫీ, పశువర్థక మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. సోమవారం కోదాడకు వచ్చిన ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌తో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పక్కన ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌

సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

కోదాడ, ఫిబ్రవరి 6 : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవని, షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సినిమాటోగ్రఫీ, పశువర్థక మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. సోమవారం కోదాడకు వచ్చిన ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌తో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ నాయకులు ఎవరు, ఏమి మాట్లాడుతారో అర్థం కాదన్నారు. అధికారంలో లేని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముందస్తు ఎన్నికలు ఉంటాయని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. పని లేని వారే ఇటువంటి మాటలు మాట్లాడతారన్నారు. మూడు లక్షల కోట్లతో సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారని, ఆ నిధులతో డిసెంబర్‌ నాటికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాకే ఎన్నికలకు వెళ్తామన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ముందస్తు ఎన్నికలు ఉంటాయనే పగటికలలు మానుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ పరిపాలన సౌలభ్యం కోసం పది జిల్లాలను 30 జిల్లాలుగా ఏర్పాటుచేసి ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లారని అన్నారు. 2.15 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రాగా, ప్రైవేట్‌ రంగంలో 24 లక్షల మందికి ఉపాధి కల్పించిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత 70 ఏళ్లలో రాష్ట్రాన్ని పాలించిన ఏ నాయకులకు చేతకాని పనులను సీఎం కేసీఆర్‌ చేసి చూపిస్తున్నారని తెలిపారు. గాంధీభవనలో కొట్టుకునే నేతలకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించదా అని ప్రశ్నించారు. కాళేశ్వరానికి ఒక నీరు చుక్క రాలేదని కాంగ్రెస్‌, బీజేపీలు మాట్లాడుతున్నాయని, నీరు రాకపోతే ధాన్యం రాశులు ఎక్కడి నుంచి వచ్చాయో దేశానికి ఆహార ధాన్యాలు సరఫరా ఎక్కడ నుంచో జరుగుతుందో చెప్పాలన్నారు. ఉత్తమకుమార్‌రెడ్డి, పద్మావతిలు కోదాడ ఎమ్మెల్యేలుగా పనిచేవవరని, వారి హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని నిలదీశారు. ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ ఆధ్వర్యంలో కోదాడలో 33 కేవీ విద్యుతలైన మార్చామని, పట్టణంలో డివైడర్లతో పాటు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుచేశామన్నారు. రూ.5 కోట్లతో పట్టణంలోని రహదారులు మరమ్మతులు చేపట్టనున్నామని తెలిపారు. అంతేకాక కోదాడ నియోజకవర్గంలో రెండు వేల డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మించామన్నారు. ఇవి జరగలేదని రోడ్డు మీదకు వస్తే, చేశామని చూపించటానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక నాసిరకం మాటలు మాట్లాడి ప్రజల్లో చులకన కావద్దన్నారు. కోదాడ పెద్దచెరువుపై నిర్మించిన లింగమంతులస్వామి ఆలయానికి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ వస్తారని దేవాలయ ప్రాంగణ సమీపంలో రిసార్ట్‌ ఏర్పాటుకు చేయనున్నామని తెలిపారు. సమావేశంలో ఎంపీపీ చింతా కవితారెడ్డి, కల్లూరి పద్మజ, ఉపేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:46:27+05:30 IST