చిన్నారి ప్రాణంతీసిన పాఠశాల బస్సు

ABN , First Publish Date - 2023-02-01T01:58:55+05:30 IST

అప్పటివరకు తల్లి వెంట ఉన్న ఆ చిన్నారి పాలిట బడి బస్సు మృత్యుశకటమైంది.

చిన్నారి ప్రాణంతీసిన పాఠశాల బస్సు

తల్లి సమీపంలో ఉండగానే ఘటన

చివ్వెంల, సూర్యాపేట అర్బన్‌, జనవరి 31:అప్పటివరకు తల్లి వెంట ఉన్న ఆ చిన్నారి పాలిట బడి బస్సు మృత్యుశకటమైంది. చివ్వెంల మండలం కోమటికుంట గ్రామంలో సోమవారం సాయం త్రం ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ విష్ణుమూర్తి తెలిపిన సమా చారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోమటికుంట గ్రామానికి చెందిన ముప్పారపు శేఖర్‌, నాగమణి దంపతులకు ఇద్దరు కుమా ర్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె కోమటికుంటకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యాపేటలోని కుడకుడలో ఉన్న అక్షర స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతోంది. ఆమె రోజూ పాఠశాల బస్సులో పాఠశా లకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుంది. సోమవారం పాఠశాల ముగిసిన తర్వాత సాయంత్రం ఐదు గంటల సమయంలో కోమటికుంట గ్రామానికి వచ్చిన పాఠశాల బస్సు నుంచి ఇంటికి తీసుకురావడానికి రెండో కుమార్తె నైనిక(3)తో తల్లి నాగమణి వెళ్లింది. అప్పటివరకు నైనికను ఎత్తుకున్న తల్లి కిందకు దించి పెద్ద కుమార్తెను బస్సు క్లీనర్‌ నుంచి అందుకోగా, అదే సమయంలో నైనిక నడుచుకుంటూ బస్సు ముందు టైరు వద్దకు వెళ్లింది. గమనించని డ్రైవర్‌ వాహనాన్ని ముందుకు నడపడంతో టైరు నడుము భాగం వరకు ఎక్కి నైనిక తీవ్రంగా గాయపడింది. తల్లి కేకలు వేయడంతో భయపడిన పాఠ శాల బస్సు డ్రైవర్‌ జెర్రిపోతుల లక్ష్మీనారాయణ ఘటనా స్థలంలోనే బస్సును వదిలిపెట్టి పరారయ్యాడు. తీవ్రంగా గాయడిన చిన్నారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నైనిక తండ్రి రైతు కాగా, తల్లి గృహిణి. డ్రైవర్‌ వదిలి పెట్టిన పాఠశాల బస్సులో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 20 మంది చిన్నారులు ఉండగా, వారిని తల్లిదండ్రులు వచ్చి ఇళ్లకు తీసుకువెళ్లారు. చిన్నారి నైనిక తల్లి నాగరాణి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ విష్ణుమూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అక్షర పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి: విద్యార్థి సంఘాలు

అక్షర పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. మృతి చెందిన చిన్నారి బంధువులతో కలిసి జిల్లా కేంద్రంలోని అక్షర పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిన్నారి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఫిట్‌నెస్‌ లేని బస్సులు, అను భవం లేని, లైసెన్సులేని డ్రైవర్లతో పాఠశాల యాజమాన్యాలు బస్సులను నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయన్నారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు ధనియాకుల శ్రీకాంత్‌వర్మ, పోలెబోయిన కిరణ్‌యాదవ్‌, పుల్లూరి సింహాద్రి, ఎర్ర అఖిల్‌, గుండా సందీప్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T01:58:58+05:30 IST