బీఆర్‌ఎస్‌ పాలనలోనే విద్యారంగం బలోపేతం

ABN , First Publish Date - 2023-02-02T00:39:12+05:30 IST

బీఆర్‌ఎస్‌ పాలనలోనే విద్యా రంగం బలోపేతమైందని జిల్లా పరిషత చైర్మన బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మన ఊరు-

బీఆర్‌ఎస్‌ పాలనలోనే విద్యారంగం బలోపేతం
ఎల్లారెడ్డిగూడెంలో తరగతి గదిని ప్రారంభిస్తున్న జడ్పీ చైర్మన నరేందర్‌రెడ్డి, పక్కన ఎమ్మెల్యే లింగయ్య

నార్కట్‌పల్లి / కట్టంగూరు, ఫిబ్రవరి 1 : బీఆర్‌ఎస్‌ పాలనలోనే విద్యా రంగం బలోపేతమైందని జిల్లా పరిషత చైర్మన బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా మరమ్మతులు చేసిన ఎల్లారెడ్డిగూడెం, నార్కట్‌పల్లి ప్రాథమిక పాఠశాలలను అదనపు కలెక్టర్‌ ఖుష్బూగుప్తాతో కలిసి బుధవారం వారు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడారు. అనంతరం తరగతిగదులను పరిశీలించి విద్యార్థులో ముచ్చ టించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన రేగట్టె మల్లిఖార్జునరెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ కల్లూరి యాదగిరి, సర్పంచలు మేడి పుష్పలత, దూదిమెట్ల స్రవంతి, ఎంపీటీసీలు మేకల రాజిరెడ్డి, పుల్లెంల ముత్తయ్య, మార్కెట్‌ వైస్‌చైర్మన కొండూరు శంకరయ్య, పాల్గొన్నారు. అదేవిధంగా కట్టంగూరు మండలం రామచంద్రాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. గ్రామంలో రూ.20లక్షలతో నిర్మించే గ్రామపంచాయతీ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, పీఏసీఎస్‌ చైర్మన నూక సైదులు, మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన పోగుల నర్సింహా, సర్పంచ సూరారపు ప్రియాంకగణేష్‌, ఎంపీటీసీ నల్లమాద వీరమ్మ సైదులు, ఎస్‌ఎంసీ చైర్మన నీలం సాయిలు ఉన్నారు.

కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ..

దేవరకొండ: కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే రమావత రవీంద్రకుమార్‌ అన్నారు. కొండమల్లేపల్లి మండలం గుడితండాలో పాఠశాల అదనపు గదులను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. అనంతరం చెన్నారంలో సీసీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారం భించారు. కార్యక్రమంలో ఎంపీపీ దూదిపాల రేఖశ్రీధర్‌రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, మేకల శ్రీనివా్‌సయాదవ్‌, తులసిరాం, సర్పంచ ఏదుళ్ల కళావతి, రమావత శ్రీను, సర్పంచ నేనావత అంజలి రాంబాబునాయక్‌, ఎంపీటీసీ రజిత పాల్గొన్నారు.

పేద విద్యార్థులకు విద్యా వెలుగులు

మిర్యాలగూడ: విద్యార్థులకు విద్యావెలుగును అంది ంచడమే ప్రభుత్వ సంకల్పమని ఎమ్మెల్యే భాస్కర్‌రావు, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు అన్నారు. షాబూనగర్‌ పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీవో చెన్నయ్య, మునిసిపల్‌ వైస్‌చైర్మన కుర్ర విష్ణు, నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

మాడ్గులపల్లి: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, నోముల భగతలు అన్నారు. మండలంలోని తోపుచర్ల, కన్నెకల్‌ గ్రామాల్లో మన ఊరు- మన బడి కింద ఆధునీకరించిన ప్రాథమిక పాఠ శాలలను వారు ప్రారంభించి, మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ పోకల శ్రీవిద్య, ఆర్డీవో చెన్నయ్య, మం డల విద్యాధికారి బాలాజీనాయక్‌, ఎంపీడీవో జితేందర్‌రెడ్డి, జిల్లా కోఆప్షన సభ్యుడు మోసినఅలీ, మండల పార్టీ అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, పీఏసీఎస్‌ ఛైర్మన రాములుగౌడ్‌, సర్పంచలు మంగా యాదయ్య, నాయకులు నవీనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:39:15+05:30 IST