తెలంగాణ బడి.. ఏపీ విద్యార్థులు

ABN , First Publish Date - 2023-02-07T00:13:38+05:30 IST

అది తెలంగాణ బడి.. పాఠశాలలో చదివే వి ద్యార్థులంతా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే.

తెలంగాణ బడి.. ఏపీ విద్యార్థులు
ఏపీ ప్రభుత్వ జగనన్న విద్యాకానుక బ్యాగుతో హాజరైన విద్యార్థిని (ఫైల్‌)

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 6: అది తెలంగాణ బడి.. పాఠశాలలో చదివే వి ద్యార్థులంతా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే. ఏపీ రాష్ట్రంలో అమలవు తున్న జగనన్న విద్యాకానుక బ్యాగులతో పాఠశాలకు హాజరవుతారు. సంక్రాంతికి వెళ్లిన వారు ఇప్పటివరకూ పాఠశాలకు రాలేదు. విద్యార్థులు రాని పాఠశాలకు ఉపాధ్యాయుడు రోజూ విధులకు వచ్చి వెళుతుంటారు. పైగా ఈ పాఠశాలలో గ్రామానికి చెందిన ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఇదీ నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని దాసరిగూడెం గ్రామ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల పరిస్థితి.

విద్యార్థులంతా వలస కూలీల పిల్లలే

దాసరిగూడెం గ్రామ జనాభా సుమారు వెయ్యిలోపు ఉంటుంది. 20 ఏళ్లుగా గ్రామంలో మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల నిర్వహిస్తు న్నారు. 2018నుంచి ఒక్క విద్యార్థి కూడా లేక పోయినా ఏకోపాధ్యాయుడు కొనసాగుతున్నారు. వేసవిలో పత్తి సేకరించేందుకు ఆంధ్రా ప్రాంతం నుం చి సుమారు 10నుంచి 15కుటుంబాలు మూడు నెలల క్రితం గ్రామానికి వలస వచ్చాయి. వారి పిల్లలను గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఈ విద్యాసంవత్సరం పాఠశాలలో చేరిన మొత్తం 11మందీ ఆంధ్రా ప్రాం తం వారేనని సమాచారం. వారికి డ్రెస్సులు, నోట్‌బుక్స్‌ అందజేశారు. పత్తి సేకరణ పనులు పాటు సంక్రాంతి పండుగ నేపథ్యంలో వలస కుటుం బాలు తమ స్వస్థలాలకు వెళ్లి ఇప్పటి వరకూ పాఠశాలకు రాలేదు. వస్తారో రారో కూడా తెలియదు. పాఠశాలకు కేటాయించిన ఉపాధ్యా యుడు రాంరెడ్డి మాత్రం రోజూ పాఠశాలకు వచ్చి వెళ్తుంటారు. నెల రోజులవుతున్నా ఆ విద్యార్థులు పాఠశాలకు రాలేదు. గ్రామానికి చెందిన ప్రాథమిక స్థాయి విద్యార్థులు వస్తే విద్యాబోధన చేద్దామని ప్రయత్ని ంచినా ఎవరూ రావడం లేదని తెలిసింది. దాసరిగూడెం ఎంపీపీఎస్‌లో చేరిన విద్యార్థులంతా ఆంధ్రా ప్రాంతానికి చెందిన విద్యార్థులేనని సీఆర్‌పీ ద్వారా తెలుసుకున్నానని ఎంఈవో కె. నర్సింహ తెలిపారు. ఆంధ్రా విద్యా ర్థులైనా పాఠశాలకు వస్తే చదువు చెప్పిస్తామని, సంక్రాంతి నుంచి విద్యా ర్థులు పాఠశాలకు రావడం లేదన్న సమాచారం లేదన్నారు. హాజరు రిజిష్టర్‌లో నమోదైన పేర్ల విద్యార్థులు రాకుంటే ఉపాధ్యాయుడి సేవలను ప్రత్యామ్నాయంగా వినియోగించుకునేలా చూస్తామన్నారు.

Updated Date - 2023-02-07T00:13:40+05:30 IST